చాలా ఆశ్చర్యకరమైన సంగతలు తెలుగు పరిశ్రమలో చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ చిత్ర దర్శకుడు, నిర్మాత కె. రాఘవేంద్రరావు తన కెరీర్లో చివరి దశలో హీరోగా మారుతున్నారు. ఆయన రిటైర్మెంట్  తీసుకుంటారు ఇక అనుకుంటున్న  ఈ సమయంలో, అతను నటుడిగా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మీడియాలో  వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే పెద్ద షాకే. ఎందుకంటే 45 ఏళ్లుగా కెరీర్‌లో కె. రాఘవేంద్రరావు సినిమాల్లో ఎలాంటి పాత్ర పోషించలేదు. తన తోటి డైరక్టర్స్ నటులుగా గెస్ట్ రోల్స్ లో కనిపించినా ఆయన మాత్రం అసలు ఆసక్తి చూపించలేదు.

సాధారణంగా సిగ్గరిగా ఉండే ఆయన టీవి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఇంట్రస్ట్ చూపరు. కాబట్టి, ఇది ఈ వార్త నిజంగా షాక్ కలిగిస్తుంది. ఈ వయసులో ఆయన హీరోగా నటించే సినిమా అంటే సబ్జెక్టు ఏదో ప్రత్యకమైనదే అయ్యింటుందని అంటన్నారు. మరి ఇంతటి మెగా దర్సకుడుని డైరక్ట్ చేసే దర్శకుడు ఎవరై ఉంటారో, ఆ కథ  ఏమై ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దాంతో ఆయన సన్నిహితులకు చాలా మంది ఫోన్స్ చేసి..వార్త నిజమేనా అని ఎంక్వైరీ చేస్తున్నారట. 

మీడియాలో వస్తున్న వార్తలను బట్టి ఈ చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు చురుకైన వేగంతో జరుగుతున్నాయి. అంతేకాకుండా, ఏడుపదుల వయసులో ఉన్న రాఘవేంద్రరావుకు ఎదురుగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారట. అతనితో నటించడానికి ఇప్పటికే మూడు ప్రముఖ హీరోయిన్లు ఖరారయ్యాయని అంటున్నారు. శ్రియ, రమ్య కృష్ణ, త్రిష ఆ  హీరోయిన్స్ అని బజ్. 

  ఇది ఇలా ఉండగా… మొన్న ఆ మధ్య లాంగ్ గ్యాప్ తర్వాత తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశారు రాఘవేంద్రరావు. 1996లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్లు రాఘవేంద్రరావు ట్విట్టర్ వేదికగా తెలిపారు. అప్పట్లో ఈ సినిమా శ్రీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక పెళ్లి సందడి సీక్వెల్ ను గౌరీ ర్రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.