`ఆర్‌ఆర్‌ఆర్‌`పై సంచలన కామెంట్స్ చేశారు వివాదాస్పద,సంచలన నాయకుడు కే ఏ పాల్‌. ఆయనకు మరో సెన్సేషన్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. ఇంటర్నెట్‌లో దుమారం రేపుతున్నారు.

వివాదస్పద, సంచలన నాయకుడు కేఏపాల్‌(K A Paul). రాజకీయ నాయకులపై, సినిమా హీరోలపై వివాదాస్పద సంచలన కామెంట్లు చేస్తూ పాపులారిటీ పొందారు పాల్‌. ఏపీలో గత ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. దీంతో చాలా రోజులు సైలెంట్‌ అయిన ఆయన ఇప్పుడు మరోసారి బయకొచ్చారు. మరోసారి తనదైన కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన `ఆర్‌ఆర్‌ఆర్‌`పై చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. 

తాజాగా కేఏ పాల్‌ అభిమానులతో లైవ్‌ఛాట్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఏప్రిల్‌ 9న మీటింగ్‌ ఉందని, అతి త్వరలో ఇండియాకి వస్తున్నట్టు చెప్పారు పాల్‌. మరోవైపు కొందరు `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) సినిమా చూశారా? అని ప్రశ్నించగా, అదెక్కడి సినిమా. రోజుకో సినిమా వస్తున్నట్టుంది అంటూ సెటైర్లు విసిరాడు. మరొకరు `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా చూస్తున్నట్టు కామెంట్లు చేయగా, మీకు పని పాట లేదా? రోజూ మూవీలు చూడటమేనా, టైమ్‌ వేస్ట్‌ చేయడమేనా? మార్పు రావాలి, మార్పు కోసం పనిచేయాలి` అంటూ తనదైన స్టయిల్‌లో క్లాస్‌ లు పీకారు పాల్‌. 

అంతేకాదు మరింతగా రెచ్చిపోయారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`ని ఉద్దేశించి చెబుతూ, `ఎవరో మూవీ చేస్తారు. మీరు మూవీ చూస్తారు. టైమ్‌ వేస్ట్ తప్ప దాని వల్ల వచ్చే లాభమేంటి? ఏదైనా మీనింగ్‌ఫుల్‌ సినిమాలు చూడాలి. `ఆర్‌ఆర్‌ఆర్‌` గురించి నేను వినలేదు. నాకు తెలియదు` అంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు దుమారం రేపుతుంది. ఆయన వీడియో యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

దీంతో దీనిపై మరో వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma) స్పందించింది. పాల్‌ వీడియోని స్క్రీన్‌ షాట్‌ని పంచుకుంటూ పాల్‌కి దిమ్మతిరిగే పంచ్‌ వేశాడు. `నీ మోహం రా` అంటూ ఒక్క మాటలో కే ఏ పాల్‌ కి కౌంటర్‌ ఇచ్చాడు RGV. ఆయన్ని తేల్చేశాడు. దీంతో వర్మ ట్వీట్‌ సైతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల వర్మ `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాపై, రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఎన్టీఆర్‌, చరణ్‌లతో రాజమౌళి దిగిన ఫోటోకి, తాను తన `డేంజర్‌` మూవీ హీరోయిన్లతో దిగిన ఫోటోలు పంచుకుంటూ డేంజరస్‌ మెన్స్ తో రాజమౌళి, డేంజరస్‌ గర్ల్స్ తో నేను` అంటూ ఆయన పెట్టిన పోస్ట్ సైతం వైరల్‌ అయ్యింది. 

Scroll to load tweet…