ఒకప్పుడు స్టార్ హీరోయన్స్ గా ఓ వెలుగు వెలిగిన  జ్యోతిక .. రేవతి  రీ ఎంట్రీలోను అదరకొడుతున్నారు. వైవిధ్యమైన పాత్రలకు,  విభిన్నమైన కథలకి మాత్రమే ఓకే చెబుతూ, ముందుకు వెళుతున్నారు. తాజాగా ఈ ఇద్దరూ ప్రధానమైన పాత్రధారులుగా తమిళంలో 'జాక్ పాట్' అనే టైటిల్ తో ఓ సినిమా చేశారు.తమిళంతో పాటు తెలుగులోను అదే టైటిల్ తో  సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపధ్యంలో   ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

ఈ ట్రైలర్లో జ్యోతిక .. రేవతి వివిధ రకాల గెటప్స్ లో కనిపిస్తున్నారు. వాళ్లు ఇచ్చే బిల్డప్స్ ను బట్టి, ఇది పూర్తిగా వినోదభరితమైన సినిమా అని తెలుస్తోంది.  ఈ సినిమా ఆగ‌స్ట్ 2న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. హీరో సూర్య త‌న స్వంత నిర్మాణ సంస్థ 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. త‌మిళ ట్రైల‌ర్ ఆల్ రెడీ విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకోగా.. తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. మెగా హీరో సాయితేజ్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి జ్యోతిక‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ట్రైల‌ర్ చూస్తుంటే హిలేరియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా ఉంటుంద‌నిపిస్తుంది. ప్ర‌ధాన పాత్ర‌ల్లో జ్యోతిక‌, రేవ‌తి పోటీ ప‌డి నటించారు. ఇంకా ఈ చిత్రంలో ఆనంద్‌రాజ్‌, రాజేంద్ర‌, మ‌న్సూర్ అలీఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. క‌ల్యాణ్ ద‌ర్శ‌కుడు. మ‌రి జ్యోతిక‌, రేవ‌తిల త‌గిలిన జాక్‌పాట్ ఏంటో తెలుసుకోవాలంటే ఆగ‌స్ట్ 2 వ‌ర‌కు ఆగాల్సిందే.