హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి స్టార్ డం సంపాదించుకున్న నటి జ్యోతిక.. సూర్యని పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరమైంది. కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈమె మళ్లీ సినిమాల్లోకి వచ్చింది. తన వయసుకి తగ్గ పాత్రలను ఎన్నుకుంటూ దూసుకుపోతుంది. 

ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో 'నవాబ్' సినిమాలో నటించిన ఈమె ప్రస్తుతం కొత్త దర్శకుడు రాజ్ తో కలిసి సినిమా చేయబోతుంది.ఈ సినిమాలో కూడా ఆమె పాత్రే కీలకంగా ఉండబోతుంది. ఈ సినిమాలో నటి పూర్ణిమా భాగ్యరాజ్, సత్య రాజ్ వంటి వారు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ఇందులో జాతిక ప్రభుత్వ పాఠశాల టీచర్ గా కనిపించనుంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది.ఇప్పుడు ఈ సినిమా కు టైటిల్ ని కన్ఫర్మ్ చేసే పనిలో పడింది చిత్రబృందం. 'రాక్షసి' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

వేసవి తరువాత సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆర్‌ఎస్‌.ప్రకాశ్, ఆర్‌ఎస్‌. ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.