తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో నటి జ్యోతి మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించింది. " 'పెళ్లాం ఊరెళ్తే' సినిమా తరువాత నాకు అన్నీ కూడా వ్యాంప్ రోల్స్ వచ్చాయి. ఇక్కడ ఒక రోల్ చేస్తే .. అది క్లిక్ అయిందంటే ఇక వరుసగా అలాంటి రోల్సే వస్తాయి".

"వ్యాంప్ రోల్స్ నుంచి బయటపడటానికి నానా తంటాలు పడ్డాను. అందుకోసం చిన్న బడ్జెట్ సినిమాల్లో హీరోయిన్ గా చేశాను .. కామెడీ .. నెగెటివ్ రోల్స్ కూడా చేశాను. నేనొక నటిని .. అన్నిరకాల పాత్రలు చేయాలనేదే నా ఉద్దేశం. ఏ పాత్ర ఇచ్చినా జ్యోతి చాలా బాగా చేస్తుందనుకునేలా వివిధ రకాల పాత్రలు చేయాలనుంది. అందుకే, వ్యాంప్ రోల్స్ దాదాపు పక్కన పెట్టేశాను .. అయితే పెద్ద బ్యానర్లో .. మంచి పేరు వస్తుందనుకుంటేనే ఆ తరహా పాత్రలు చేస్తాను" అని చెప్పుకొచ్చింది.