కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలు పోషిస్తోన్న చిత్రం 'జడ్జిమెంటల్ హై క్యా'. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఒక మర్డర్ మిస్టరీ నేపధ్యంలో సాగే కథ ఇది. ఆ మర్డర్ కంగనా, రాజ్ కుమార్ రావులలో ఎవరో ఒకరు చేశారని పోలీసులు అనుమానిస్తుంటారు. కొద్దిగా మతిస్థిమితం లేని బాబీ అనే పాత్రలో కంగనా మంచి పెర్ఫార్మన్స్ కనబరిచింది.

రాజ్ కుమార్ రావు.. కేశవ్ అనే పాత్రలో కనిపించనున్నారు. కథ మొత్తం ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంటుంది. మొదట ఈ సినిమాకి 'మెంటల్ హై క్యా' అనే టైటిల్ పెట్టారు. కానీ టైటిల్ పట్ల అభ్యంతరాలు రావడంతో 'జడ్జిమెంటల్ హై క్యా' అని పెట్టారు.