ఎన్టీఆర్ కి పంచ్ మీద పంచ్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 27, Aug 2018, 10:42 AM IST
Jr NTR turns punching bag for his son Abhay Ram
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ అప్పుడప్పుడు తండ్రితో కలిసి పార్టీల్లో కనిపిస్తుంటాడు. అలానే అభయ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను తారక్ అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తుంటాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ అప్పుడప్పుడు తండ్రితో కలిసి పార్టీల్లో కనిపిస్తుంటాడు. అలానే అభయ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను తారక్ అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తుంటాడు. తాజాగా అభయ్ కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశాడు తారక్. ఈ వీడియోలో అభయ్ తన తండ్రి ముందు కూర్చొని చెంపలు వాయిస్తూ కనిపించాడు.

'నా కుమారుడికి నేను పంచింగ్ బ్యాగ్ అయిపోయా' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు తారక్. కరాటే కిడ్ అని హ్యాష్ ట్యాగ్ కూడా జోడించాడు. దీని బట్టి అభయ్ కరాటే నేర్చుకుంటున్నట్లు ఉన్నాడు. మొత్తానికి అభయ్ తన తండ్రికి పంచ్ లు ఇస్తూ కనిపించిన ఈ వీడియో తారక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తారక్ కి జంటగా పూజా హెగ్డే కనిపించనుంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరికొద్ది రోజుల్లో రెండో టీజర్ ని కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

 

When you become a #punchingbag for your son #karatekid #elderbrat #lazysunday

A post shared by Jr NTR (@tarak9999official) on Aug 26, 2018 at 8:09am PDT

loader