యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగష్టు 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తాజాగా ఎయిర్ పోర్ట్ లో కనిపించిన విధానం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగష్టు 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అదే విధంగా ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా నటిస్తున్నారు. వార్ 2లో హృతిక్ రోషన్ తో కలసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తాజాగా ఎయిర్ పోర్ట్ లో కనిపించిన విధానం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. 

ఈరోజు ఉదయం టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలతో కలిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. వారి ఫ్యామిలీ ఎయిర్‌పోర్ట్‌లో మెరవడంతో ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. అయితే అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం ఒకటుంది. అది ఎన్టీఆర్ చేతిలో ఉన్న పుస్తకం.

ఎన్టీఆర్ చేతిలో “మురుగ ది లార్డ్ ఆఫ్ వార్, ది గాడ్ ఆఫ్ విస్డమ్ (Muruga - The Lord of War, The God of Wisdom)” అనే పుస్తకం ఉండటం సినీ ప్రియులు, అభిమానులలో ఆసక్తిని రేపింది. ఈ పుస్తకాన్ని రచయిత ఆనంద్ బాలసుబ్రమణియన్ రచించారు.

ఎన్టీఆర్ ఆ పుస్తకంతో కనిపించడానికి ఒక కారణం ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మైథాలజికల్ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం కుమారస్వామి (కార్తికేయ, సుబ్రహ్మణ్య స్వామి) కథ ఆధారంగా రూపొందనుంది. ఆ పాత్రలో సంపూర్ణంగా లీనమయ్యేందుకు ఆ పుస్తకాన్ని ఎన్టీఆర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. ఈ పుస్తకం ద్వారా దేవుడి చరిత్ర, గుణగణాలు, పురాణపరమైన వివరాలపై అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.

View post on Instagram

ఈ ప్రాజెక్ట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, పుస్తక ఎంపిక చూస్తుంటే ఎన్టీఆర్ పాత్ర కోసం ముందుగానే అధ్యయనం ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ తదుపరి భారీ చిత్రం "War 2" రిలీజ్‌కి కేవలం 50 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలా ఒకవైపు యాక్షన్ చిత్రానికి సిద్ధమవుతూనే, మరోవైపు మైథాలజికల్ క్యారెక్టర్‌లోకి దిగేందుకు అధ్యయనంతో ముందడుగు వేస్తున్న ఎన్టీఆర్ తీరుపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. తారక్ కుమారస్వామి పాత్ర కోసం పుస్తకం చదివి మరీ ప్రిపేర్ అవుతున్నారు అంటే.. నట విశ్వరూపం ఖాయం అని అంతా భావిస్తున్నారు.