యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండో కుమారుడు భార్గవ్ రామ్ శుక్రవారం తన మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్.. తన సోషల్ మీడియాలో అపురూపమైన ఫోటోలను పంచుకున్నారు. 

కొడుకుని చూసుకొని మురిసిపోతున్న ఎన్టీఆర్ ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరొక ఫోటోలో ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ తమ్ముడి పక్కన కూర్చొని ఫోటోలను ఫోజిచ్చాడు. ఈ ఫోటోలను ఎన్టీఆర్ షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. లక్షల్లో లైక్ లు వస్తున్నాయి.

'భార్గవ్ తొలి పుట్టినరోజు' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు లిటిల్ టైగర్ కి శుభాకాంక్షలు అంటూ విషెస్ చెబుతున్నారు. ఎన్టీఆర్ తన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తాడు. తన పెద్ద కొడుకు చేసే అల్లరిని అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ 'RRR' చిత్రంలో నటిస్తున్నారు. తారక్ చేతికి గాయం కావడంతో షూటింగ్ కొన్నిరోజులు వాయిదా పడింది. వచ్చే ఏడాది జూలై నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Bhargav turns one!

A post shared by Jr NTR (@jrntr) on Jun 13, 2019 at 9:34pm PDT