Asianet News TeluguAsianet News Telugu

థాంక్యూ మామయ్య.. చంద్రబాబు ట్వీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ రిప్లై..

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు...’ గీతానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కింది. దీంతో పలువురు ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు. 

JR NTR Say Thanks To Chandrababu naidu After congratulations for RRR over Golden Globes win
Author
First Published Jan 11, 2023, 3:34 PM IST

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు...’ గీతానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కింది. ఆ పాటకు సంగీతం అందించిన ఎంఎం కీర‌వాణి అవార్డును అందుకున్నారు. దీంతో పలువురు ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆర్‌ఆర్ఆర్ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్  అందుకుందని తెలసుకుని సంతోషించానని చెప్పారు. 

కీరవాణి, రాజమౌళితో పాటు ఆర్‌ఆర్ఆర్ టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. అవార్డు రావడం అందరూ గర్వపడాల్సిన విషయమని అన్నారు. తాను ముందుకు చెప్పినట్టే.. ఇండియన్ సాఫ్ట్ పవర్ భాషగా తెలుగు మారుతుందని అన్నారు. 

 

 

అయితే చంద్రబాబు ట్వీట్‌కు ఆర్‌ఆర్ఆర్ చిత్రంలో హీరోగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు . ‘‘థాంక్యూ సో మచ్ మామయ్య’’ అంటూ రిప్లై ఇచ్చారు. అయితే చంద్రబాబు ట్వీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఈ విధమైన రిప్లై ఇవ్వడంతో టీడీపీ అభిమానులు ఒకింత సంబరంలో మునిగిపోయారు. మరోవైపు కీరవాణి కూడా ‘‘థాంక్యూ సో మచ్ సార్’’అని చంద్రబాబు ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. మరోవైపు ప్రధాని మోదీ అభినందనలు తెలుపగా.. అందుకు జూనియర్ ఎన్టీఆర్ థాంక్యూ సార్ అని బదులిచ్చారు. 

థాంక్యూ సార్.. జగన్ ట్వీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ రిప్లై.. 
ఇదిలా ఉంటే.. సీఎం జగన్‌కు కూడా ఎన్టీఆర్ థాంక్యూ చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై.. ‘‘తెలుగు జెండా రెపరెపలాడుతోంది! ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి తరపున నేను కీరవాణి, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, మొత్తం ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నాను. మేము మీ గురించి చాలా గర్వపడుతున్నాం’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్.. ‘‘థాంక్యూ సార్’’ అని  రిప్లై ఇచ్చారు. 

Also Read: ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసింది.. ఆర్‌ఆర్‌ఆర్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డుపై ప్రధాని మోదీ అభినందనలు..


ఇక, రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ తెరకెక్కింది. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్, శ్రీయా కీలక రోల్స్ చేశారు. ఇక, ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి  సంగీతం అందించారు. ‘నాటు నాటు’ గీతాన్ని చంద్రబోస్ సాహిత్యం అందించగా..  రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలు పాడారు. 

ఇక, ఆర్‌ఆర్‌ఆర్ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతుంది. పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో అరుదైన మైలురాయిని చేరుకుంది. దర్శకుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి గాను న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు గెలుపొంచారు. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ఆర్‌ఆర్ఆర్ ‌లోని నాటు నాటు సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు లభించింది. గోల్డెన్ గ్లోబ్ విజయంతో ఆస్కార్ పై ఆశలు బలపడ్డాయి. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయ్యింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios