Asianet News TeluguAsianet News Telugu

ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసింది.. ఆర్‌ఆర్‌ఆర్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డుపై ప్రధాని మోదీ అభినందనలు..

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు...’ గీతానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం‌తో పలువురు ఆ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు.

PM Modi congratulates Team RRR over Golden Globes win says this honour has made every Indian very proud
Author
First Published Jan 11, 2023, 1:24 PM IST

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు...’ గీతానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం‌తో పలువురు ఆ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. కీరవాణి, చిత్రయూనిట్ ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చాలా ప్రత్యేకమైన పురస్కారమని అని అన్నారు. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్‌లకు అభినందనలు తెలియజేశారు. అలాగే రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, మొత్తం చిత్ర బృందంకి కూడా అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసిందని పేర్కొన్నారు. 

రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ తెరకెక్కింది. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్, శ్రీయా కీలక రోల్స్ చేశారు. ఇక, ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి  సంగీతం అందించారు. ‘నాటు నాటు’ గీతాన్ని చంద్రబోస్ సాహిత్యం అందించగా..  రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలు పాడారు. 

 


ఇక, ఆర్‌ఆర్‌ఆర్ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతుంది. పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో అరుదైన మైలురాయిని చేరుకుంది. దర్శకుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి గాను న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు గెలుపొంచారు. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ఆర్‌ఆర్ఆర్ ‌లోని నాటు నాటు సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు లభించింది. గోల్డెన్ గ్లోబ్ విజయంతో ఆస్కార్ పై ఆశలు బలపడ్డాయి. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios