యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేంతగా జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ను మలిచాడు.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ మూవీ విడుదలై 50 రోజులు దాటిన తర్వాత ఓటిటిలోకి వచ్చింది. అప్పటికే దాదాపు రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఇంకా కొన్ని చోట్ల ప్రదర్శితం అవుతూనే ఉంది. అదే సమయంలో ఈ సినిమాకు ఓటిటిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఓటిటిలో ఎంత మంది చూసారు అనే విషయం అభిమానుల్లో, మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఆ వివరాల్లోకి వెళితే... తెలుగు సహా నాలుగు భాషల్లో జీ5 స్ట్రీమింగ్ చేసింది. ఇక హిందీ వెర్షన్ సొంతం చేసుకుంది నెట్ ఫ్లిక్స్ . ఈ రెండు సంస్దలు పోటీ పడి మరీ మార్కెటింగ్ చేసారు. ఈ నేపధ్యంలో ఏ ఓటిటిలో ఎక్కువ మంది చూసారు అనేది తెలుసుకోవాలని చాలా మందికు ఆసక్తి ఉంది. ఆ సంస్దలు రివీల్ చేసిన లెక్కలు ప్రకారం... జీ5 లో ట్రిపులార్ 190 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. 1000 మిలియన్ నిమిషాల వ్యూస్ వచ్చాయని అఫీషియల్ గా ప్రకటించింది. అంటే గంటల లెక్కలో 16,666,667 గంటలు. ఇది జీ5లో ఉన్న అన్ని లాంగ్వేజెస్ కలిపి ఇన్ని వ్యూస్ వచ్చాయి.
నెట్ ఫ్లిక్స్ సంగతి చూస్తే మూడు వారాల దాకా 39,480,000 గంటల వ్యూస్ సాధించింది. అంటే జీ5 కన్నా నెట్ ఫ్లిక్స్ లో 22,813,334 గంటల వ్యూస్ అధికంగా వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ కున్న గ్లోబల్ రీచ్ ఆర్ఆర్ఆర్ వ్యూస్ కు ఉపయోగపడిందంటున్నారు. దానికి తోడు తన నెట్ వర్క్ తో అక్కడ బాగా పాపులర్ చేసారు. దేశవిదేశాల నుంచి సెలబ్రిటీ ట్వీట్లు ట్రిపులార్ ని పొగడ్తలతో ముంచెత్తటం కలిసొచ్చింది. జీ5 ఇండియాలో మాత్రం ఆర్ఆర్ఆర్ నెంబర్ వన్ గా అయ్యింది. రాటెన్ టొమాటోస్ లో ఆర్ఆర్ఆర్ గురించి ప్రస్తావించాక... దీని గురించిన ప్రచారం మరింతగా పెరిగిపోయి,నెట్ ప్లిక్స్ కు బాగా కలిసివచ్చింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేంతగా జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ను మలిచాడు.
