జూనియర్‌ ఎన్టీఆర్‌ కు తన అన్న కళ్యాణ్‌రామ్‌ అంటే ఎంత అభిమానమో తెలిసిందే. తన అన్న ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పిలిచి తన డేట్స్ ఇచ్చి సినిమా చేసారు. అలాగే ఇప్పుడు తన అన్న కెరీర్ నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారట.   కళ్యాణ్‌రామ్‌ పటాస్‌ సినిమా తర్వాత సరైన హిట్‌ పడలేదు. మధ్యలో 118 లాంటివి ఓ మోస్తరు గా ఆడినా పెద్ద కలిసొచ్చిందేమో లేదు. అలాగే ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజైన ఎంత మంచివాడవురా సినిమా కూడా ఫ్లాఫ్ అయ్యింది.  దాంతో కళ్యాణ్‌రామ్‌ తరువాత సినిమా లు పెద్దగా కమిటవ్వలేదు. తుగ్లక్ అనే సినిమా ఓకే చేసినా అది పట్టాలు ఎక్కలేదు. 

ఈ మధ్య ఫ్యామిలీ ఫంక్షన్ జరిగినప్పుడు అన్నదమ్ముల మధ్య ఇదే విషయమై డిస్కషన్ జరిగిందిట. మొహమాటానికి పోయి సినిమాలు ఒప్పుకోవద్దు అని సూచించాడట. అలాగే తనే డైరక్టర్ ని, కథని ఓకే చేస్తానని అన్నారట. అవసరమైతే తనే సినిమాని సమర్పించి ప్రాజెక్టుకు క్రేజ్ తెస్తానని మాట ఇచ్చారట.  ఈ క్రమంలో తన అన్నకి హిట్‌ ఇట్టే దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారట. ఈ మేరకు ఎన్టీఆర్ కథలు సైతం వింటున్నారట. రెండు స్టోరీ లైన్స్ ఓకే చేసి పూర్తి స్క్రిప్టు తో కలవమని చెప్పారట. 

అలా కథ ఎంపిక విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కళ్యాణ్‌రామ్‌ తదుపరి చిత్రాన్ని నిర్మించమని ఇప్పటికే ఎన్టీఆర్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ని ఒప్పించారని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్‌ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్నారు. ఆ తరువాత త్రివిక్రమ్‌, ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వ సినిమాల్లో కూడా నటించడానికి రెడీ అవుతున్నారు.