2018 ఆగస్టు 29న ఓ రోడ్డు ప్రమాదంలో హరికృస్ణ మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హరికృష్ణను తలుచుకున్న ప్రతీ సారి ఎన్టీఆర్ కళ్లు చెమ్మగిల్లటం అభిమానులు చూస్తూనే ఉన్నారు. ఈ రోజు తన తండ్రి 64వ జయంతి సందర్భంగా మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు ఎన్టీఆర్.

బుధవారం దివంగత నటుడు నందమూరి హరికృష్ణ జయంతి. ఈ సందర్భంగా ఆయన తనయుడు టాలీవుడ్ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ తండ్రిని తలచుకొని భావొద్వేగానికి లోనయ్యారు. తండ్రితో తన అనుబంధాన్ని తలుచుకుంటూ ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు తారక్‌. `మిస్ యూ నాన్నా.. ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ప్రస్థానానికి నేతృత్వం మీరు . ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే` అంటూ తండ్రి ఫోటోతో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.

Scroll to load tweet…

బాలనటుడిగానే సినీ రంగంలోకి అడుగుపెట్టిన హరికృష్ణ తరువాత ఎన్టీఆర్ రాజకీయ రంగం ప్రవేశంలోనూ కీలక పాత్ర పోషించాడు. నందమూరి సినీ వారసులుగా తన ఇద్దరు కుమారులు ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌లను వెండితెరకు పరిచయం చేశారు. సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసిన హరికృష్ణ మరో కుమారుడు జానకి రామ్‌ను నిర్మాతగా పరిచయం చేశాడు. కానీ ఆయన ఓ ప్రమాదంలో మరణించటం ఆ నిర్మాణ బాధ్యతలను కూడా కళ్యాణ్ రామే తీసుకున్నాడు.