Ntr:‘రాజావారు’భాధ్యత మొత్తం ఎన్టీఆర్ దే, త్వరలోనే ప్రకటన!
జూనియర్ ఎన్టీఆర్ కూడా తన బావమరిదిని అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నాడు. ఏ అవసరం వచ్చినా పక్కనే ఉంటాను కానీ.. కెరీర్ మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోమని సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు ఇండస్ట్రీలో వారసుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది ఉన్నారు. అయినా ఇంకా వస్తూనే ఉన్నారు.. ఇప్పుడు మరో వారసుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఈ హీరో రానున్నాడు. తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నితిన్ చంద్ర హీరోగా పరిచయం కాబోతున్నారు. అతని తొలి చిత్రం భారం మొత్తం ఎన్టీఆర్ చూడబోతున్నారట.
తెలుగులో మళయాళ చిత్రాల హవా నడుస్తోంది. మొన్నటిదాకా ఆహా లో మళయాళ డబ్బింగ్ లు చూస్తే ...ఇప్పుడు మళయాళ రీమేక్ లు వరస కడుతున్నాయి. తెలుగులో ప్రస్తుతం ఒక పది చిత్రాల వరకూ మలయాళ రీమేక్సే తెరకెక్కుతున్నాయని సమాచారం. మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్, పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’ చిత్రాలు మలయాళ రీమేక్స్ వరస కట్టారు. అలాగే రాజశేఖర్ ‘శేఖర్’ చిత్రం కూడా మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ రీమేక్ వెర్షనే. ఇక సుమంత్ హీరోగా నటిస్తున్న వాల్తేరు శీను కూడా ‘పడయోట్టం’ మలయాళ చిత్రానికి రీమేక్ వెర్షన్ కావటం మరో విశేషం.
ఇంకా అనేత చిత్రాలు మలయాళం నుంచి రీమేక్ అవుతుండగా.. ఇప్పుడు ఓ కొత్త హీరో మలయాళ రీమేక్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ హీరో మరెవ్వరో కాదు యంగ్ టైగర్ యన్టీఆర్ కు స్వయానా బావమరిది. నార్ని శ్రీనివాసరావు తనయుడైన నితిన్ చంద్ర హీరోగా రీసెంట్ గానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళిందని సమాచారం.
వాస్తవానికి దర్శకుడు తేజ సినిమాతో నితిన్ చంద్ర నటుడిగా ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఆ తరువాత దర్శకుడు సతీష్ వేగ్నేశను రంగంలోకి దించారు. ఇప్పుడు నితిన్ చంద్ర హీరోగా ఆయన తెరకెక్కిస్తోన్న సినిమా కూడా ఓ ఫ్యామిలీ డ్రామా . మలయాళంలో సక్సెస్ అందుకున్న ‘తీవండి’ అనే సినిమా ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. టోవినో థామస్ నటించిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. హిట్ కథ కావడంతో నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నారు.
ఇప్పుడు దీనికి ‘శ్రీ శ్రీ రాజావారు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ అయితే కథకు యాప్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. మలయాళం సినిమా ఆధారంగా తీస్తున్నప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశారట. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎన్టీఆర్ సాయిం తీసుకోబోతున్నారట. స్వయంగా ఎన్టీఆర్ ముందుకు వచ్చి చేయబోతున్నట్లు వినికిడి.
ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు వినికిడి. ఈ సినిమాను నితిన్ చంద్ర తండ్రి నార్నే శ్రీనివాసరావు స్వయంగా నిర్మిస్తున్నారు.సతీశ్ వేగేశ్న డైరెక్ట్ చేసిన ‘శతమానం భవతి’ చిత్రానికి నేషనల్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సతీశ్ నితిన్, కళ్యాణ్ రామ్ తో తీసిన చిత్రాలు నిరాశ పరచడంతో తదుపరి అవకాశాల కోసం వేచి చూస్తున్నాడు. అలాగే.. ‘కోతికొమ్మచ్చి’ అనే సినిమాతో తన తనయుడ్ని కూడా హీరోగా లాంఛ్ చేస్తున్నారు సతీశ్ వేగేశ్న. ఇప్పుడు దాంతో పాటు నితిన్ చంద్రను కూడా లాంఛ్ చేసే బాధ్యతను చేపట్టారు. మరి శ్రీశ్రీరాజావారు చిత్రం నితిన్ చంద్రకి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలంటున్నారు.