ఎన్టీఆర్ మరో సారి మరో షోకు ఓకే చేసినట్లి సమాచారం. ఓ ఓటీటీ షోకు ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారని సమాచారం.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఎన్టీఆర్ 30 (#NTR30) షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్‌తో ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చింది. ఈ సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్‌ మూవీలో కూడా ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. అలాగే ‘బ్రహ్మాస్త్ర’ సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం ‘వార్-2’లో కూడా ఎన్టీఆర్ నటించనున్నారని వార్తలు వచ్చాయి. ఇవి కాగానే దర్శకుడు వెట్రిమారన్ మూవీలో కూడా ఎన్టీఆర్ నటించనున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్ తెరకెక్కేందుకు మరికొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది. వీటి మధ్యలో మళ్లీ ఓ షోకు హోస్ట్‌గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. అది కుదిరిపనేనా అంటే అందుకు తగ్గ ప్లాన్స్ జరుగుతున్నాయంటున్నారు.

ఎన్టీఆర్ కు షోలు చేయటం కొత్తేమీ కాదు. మొదటి సారి అసలే కాదు. గతంలో ఆయన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’లో హోస్ట్‌గా ఓ రేంజిలో దుమ్ము రేపారు. అంతేకాదు, తెలుగులో ‘బిగ్ బాస్’ షోకు హోస్ట్‌గా చేసి పేరు తెచ్చుకున్నారు . ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మరో సారి మరో షోకు ఓకే చేసినట్లి సమాచారం. ఓ ఓటీటీ షోకు ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారని సమాచారం. ఈటీవీ ఛానెల్‌లో ఓ టాక్ షో చేయడానికి నిర్మాతలు జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించారట. ఈ టాక్ షో ఈ టీవీ విన్ (OTT) ఛానెల్‌లో ప్రసారం కానున్నట్లు సమాచారం. 

అయితే, ఈ టాక్ షో కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే సైన్ చేశారా? లేదా ఇంకా పరిశీలనలో ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సమాచారం తెలిసి ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. మరో ప్రక్క #NTR30 మూవీ షూటింగ్ ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జగుతోంది. అయితే తారక్ బర్త్ డే వస్తుండడంతో ఆరోజున అభిమానుల్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మే 20న మోషన్ పోస్టర్ తోపాటు.. టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయనున్నారట.ఇందులో తారక్ ను అద్భుతంగా చూపించనున్నారటు. అయితే ఆయన సూచించిన టైటిల్ ను అందరూ ఆమోదిస్తే తారక్ బర్త్ డే రోజు కచ్చితంగా అనౌన్స్ చేస్తారు. డైరెక్టర్ ప్రస్తుతం ఓ టైటిల్ ను చెప్పారట.