ఎన్టీఆర్: బిగ్ బాస్ లో నాని చెప్పేవి కాకమ్మ కథలు..

Jr NTR Appriciates Nani's Hosting In Bigg Boss 2
Highlights

నాని కూడా తనదైన స్టైల్ లో మెప్పిస్తున్నాడు. ప్రతివారం నాని చెప్పే కాకమ్మ కథలు బాగుంటున్నాయి. అవి ఆడియన్స్ కు మంచి మసాలా

రియాలిటీ షోలలో నెంబర్ వన్ గా దూసుకుపోతుంది బిగ్ బాస్. తెలుగులో ఈ షో సీజన్ 2కి మొదట్లో నెగెటివ్ కామెంట్స్ వినిపించినా ఇప్పుడు మాత్రం పుంజుకుంది. హోస్ట్ గా నాని తన బాధ్యతలు నిజాయితీగా నిర్వర్తిస్తున్నాడు. మొదట్లో ఎన్టీఆర్ యాంకరింగ్ తో నానిని పోల్చి తక్కువ చేసిన వాళ్లు కూడా ఇప్పుడు నానిని మెచ్చుకుంటున్నారు. మిగతా వారి అభిప్రాయలు సంగతి పక్కన పెడితే మరి నాని పెర్ఫార్మన్స్ మీద ఎన్టీఆర్ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో కలిగింది.

రీసెంట్ గా ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందించాడు. వ్యాఖ్యాతగా నానిని కొనియాడారు. ''నాని మంచి నటుడు.. బిగ్ బాస్ షో లో అతడు చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నాడు.బిగ్ బాస్ అనేది ఒక సక్సెస్ ఫుల్ ఫ్లాట్ ఫామ్. నిజానికి ఇందులో ఎవరు చేసినా బాగానే చేస్తారు. నాని కూడా తనదైన స్టైల్ లో మెప్పిస్తున్నాడు. ప్రతివారం నాని చెప్పే కాకమ్మ కథలు బాగుంటున్నాయి. అవి ఆడియన్స్ కు మంచి మసాలా'' అని వెల్లడించారు.

అలానే ఎన్టీఆర్ సినిమాలో మీరు నటిస్తున్నారా..? అనే ప్రశ్నకు సమాధానంగా ఇంతకముందే ఈ ప్రశ్నకు జవాబిచ్చానని.. మళ్లీ మళ్లీ అడిగినా తన  ఆన్సర్ మాత్రం ఒక్కటేనని అన్నారు.  

loader