`మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. ` అంటూ సీనియర్‌ ఎన్టీఆర్‌కి జూ.ఎన్టీఆర్‌ నివాళి అర్పించారు. నేడు శుక్రవారం ఎన్టీఆర్‌ 98వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పెద్ద ఎన్టీఆర్‌ని గుర్తు చేసుకున్నారు చిన్న ఎన్టీఆర్‌. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా ఎమోషనల్‌  పోస్ట్ పెట్టారు. రూపంలో, డైలాగ్‌ డెలివరీలో, నటనలో సీనియర్‌ ని ఎన్టీఆర్‌ ని తలపిస్తుంటారు జూ. ఎన్టీఆర్‌ అన్న విషయం తెలిసిందే.

మరోవైపు కళ్యాణ్‌ రామ్‌ సైతం స్పందించి నివాళి అర్పించారు. `మా ఖ్యాతి మీరే.. మా కీర్తి మీరే.. ఓ విశ్వ విఖ్యాత, అందుకో మా జ్యోత` అని పేర్కొంటూ ఎన్టీఆర్‌ ఫోటోని పంచుకున్నారు కళ్యాణ్‌ రామ్‌. వీరితోపాటు అనేక సినీ ప్రముఖులు ఎన్టీఆర్‌కి నివాళ్ళు అర్పించారు. 

జూ.ఎన్టీఆర్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మరో హీరో. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. అలియా భట్‌, ఓలివియా మోర్రీస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 13న దసరా కానుకగా విడుదల కానుంది.