మూడు హిట్లు కొట్టి జోరుతో బాబాయ్.. భారీ అంచనాలతో అబ్బాయ్.. నందమూరి హీరోల క్లాష్ ?
బాబాయ్ అబ్బాయ్ లు నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాలు వచ్చే ఏడాది వేసవిలో దాదాపుగా ఒకే సమయంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

స్టార్ హీరోల చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అవుతుంటే అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయిలో ఉంటుంది. ఎవరి చిత్రం విజయం సాధిస్తుంది ? ఎవరి మూవీ చతికిలబడుతుంది ? లాంటి ప్రశ్నల గురించి అభిమానుల్లో చర్చ మొదలవుతుంది. అదే ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల చిత్రాలు ఒకే సమయంలో రిలీజ్ అవుతుంటే ఆ హంగామా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల చిత్రాలు ఒకేసారి రిలీజ్ కావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆ అరుదైన ఘట్టం వచ్చే ఏడాది చూసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా నందమూరి హీరోల మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బాబాయ్ అబ్బాయ్ లు నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాలు వచ్చే ఏడాది వేసవిలో దాదాపుగా ఒకే సమయంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో ఇలా జరిగింది కూడా. 2016లో బాలయ్య నటించిన డిక్టేటర్, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రాలు ఒక్కరోజు వ్యవధిలో రిలీజ్ అయ్యాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ చిత్రం విజయం సాధించగా.. బాలయ్య మూవీ నిరాశపరిచింది.
ప్రస్తుతం బాలయ్య మూడు వరుస హిట్ల తర్వాత డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సమ్మర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ఈ చిత్ర రిలీజ్ డేట్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల 150 రోజుల కౌంట్ డౌన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
బాలయ్య, బాబీ చిత్రం కూడా దాదాపుగా అదే సమయంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అదే సమయంలో ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ హీట్ ని క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మరోసారి నందమూరి హీరోల బాక్సాఫీస్ పోటీ చూడొచ్చని ఇండస్ట్రీలో టాక్.