నందమూరి అభిమానులతో పాటు.. ఆడియన్స్ అందరిని కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన మూవీ అదుర్స్. ఎన్నిసార్లు చూసినా.. ఇప్పటికీ బోర్ కొట్టకుండా నవ్వింగల ఈ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది.  

ఈ మధ్యన రీరిలీజ్ లు, రీమేక్ ల ట్రెండ్ నడుస్తోంది. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన స్టార్ హీరోల సినిమాన్నీ రీ రిలీజ్ చేస్తున్నారు . ఇప్పటికే పవర్ స్టార్ ఖుషి, జల్సా, మహేష్ బాబు ఒక్కడు, లాంటి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. మంచి రెస్పాన్స్ కూడా సాధించాయి. ఈక్రమంలోనే త్వరలో పవర్ స్టార్ బద్రీ కూడా రీరిలీజ్ రెడీ అవుతున్న క్రమంలో.. మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్ నే మలుపుతిప్పిన సినిమా అదుర్స్ ను రీరిలీజ్ చేయబోతున్నట్టు టాక్.

జూనియర్ ఎన్టీఆర్, నయనతార, షీలా కౌర్ జంటగా.. వివి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన కామెడీ..యాక్షన్ మూవీ అదుర్స్. బ్రహ్మానంద, ఎన్టీఆర్ కామెడీతో కడుపు చెక్కలయ్యేలా కామెడీ వర్షం కురిపించిన ఈసినిమా ఈ సినిమా మళ్లీ థియేటర్‌లోకి రాబోతుంది. మార్చి 4న ఫోర్‌ కె ప్రింట్‌తో అదుర్స్‌ మూవీని రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రీ-రిలీజ్‌కు సంబంధించిన పనులు కూడా స్టార్‌ అయిపోయాయి.

మార్చి ఫస్ట్ వీక్ లో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట టీమ్. ఈ వీక్ లో పెద్ద సినిమాలేవి రిలీజ్ కు లేకపోవడంతో... అదుర్స్ ను అప్పుడు రిలీజ్ చేస్తే.. అదుర్స్‌కు మంచి కలెక్షన్‌లు వచ్చే చాన్స్ ఉంటుదని అనుకుంటున్నారు. ఇక గతంలో ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందంటూ ప్రచారం వచ్చినా.. డైరెక్టర్ వివి వినాయక్‌ ఈ విషయంలో ఇంట్రెస్ట్ చేపించలేదని తెలుస్తోంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్‌లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.


ఎన్టీఆర్‌ సినిమాల్లో అదుర్స్‌ చాలా స్పెషల్. . తారక్‌ కెరీర్‌లో ఎన్ని సినిమాలు ఉన్నా.. ఎన్ని హిట్లు ఉన్నా.. ఎన్ని బ్లాక్‌బస్టర్‌లు ఉన్నా అదుర్స్‌ మూవీ అప్పటికీ..ఇప్పటికీ స్పెషల్‌. ముఖ్యంగా బ్రాహ్మణుడిగా తారక్‌.. ఆయన గురువుగా బ్రహ్మానందం.. గురు శిశ్యులుగా బ్రహ్మీ,తారక్‌ మధ్య కామెడీ.. తలుచుకుంటేనే నవ్వు తన్నుకొస్తుంది. ఇప్పటికీ సోషల్‌ మీడియాలో వీరిద్ధరి ఎక్స్‌ప్రెషన్లు మీమ్స్‌ రూపంలో రోజు వందల సార్లు చూస్తుంటాం. ఈ సినిమాకు కామెడీ ఎంత ప్లస్ అయ్యిందో.. యాక్షన్ కూడా అంతే వర్కౌట్ అయ్యింది. ఇక దేవిశ్రీ సంగీతం బాగా ప్లస్ అయ్యిందని చెప్పాలి.