ఆకాశ వీధిలో అందాల జాబిలి రాలిపోయినా...

Jr actors play Savitri roles in TV programmes
Highlights

బోనాల సందర్భంగా జీ తెలుగు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. టీవీ ఆర్టిస్టులు వివిధ ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో మహానటి సావిత్రిపై ఓ కార్యక్రమం చేశారు.

బోనాల సందర్భంగా జీ తెలుగు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. టీవీ ఆర్టిస్టులు వివిధ ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో మహానటి సావిత్రిపై ఓ కార్యక్రమం చేశారు. రవి, శ్రీముఖి హోస్ట్ లుగా వ్యవహరించిన కార్యక్రమంలో పలువురు ప్రదర్శనలు ఇచ్చారు. 

ఒక్క సావిత్రి చనిపోతే పది మంది సావిత్రిలు పుడుతారని వారు తమ నటన ద్వారా నిరూపించారు. పదిమంది జూనియర్ ఆర్టిస్టులు సావిత్రి వేసిన వివిధ పాత్రలకు మరోసారి జీవం పోశారు. ఆ రకంగా పది మంది సావిత్రిలు పుడుతారని నిరూపించారు. 

ఒక్కో మహిళా ఆర్టిస్టు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్వీ రంగారావులుగా నటించిన జూనియర్ ఆర్టిస్టుల సరసన సావిత్రి వేసిన పాత్రల్లో నటించి, నటనకు జీవం పోశారు. ఆ కాల వీధిలో అందాల జాబిలి రాలిపోయినా పది మంది సావిత్రులు ఆ సావిత్రికి జీవం పోశారు. 

- సరస్వతి

loader