బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేటైన ఐదవ కంటెస్టెంట్ జోర్దార్ సుజాత. ఈ ఆదివారం ఆమె ఎలిమినేటై బయటికి రావడం జరిగింది. హౌస్ నుండి బయటికి వచ్చిన సుజాత తాజా ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. అఖిల్, అభిజిత్ తో మోనాల్ నడుపుతున్న లవ్ ట్రాక్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

హౌస్ లో మోనాల్ ఇద్దరితో ప్రేమ వ్యవహారం నడుపుతుంది.రెండు పడవల ప్రయాణంలా ఉంది. ఇది ట్రై యాంగిల్ లవ్ స్టోరీ కాదు. వెరైటీగా ఇది వి యాంగిల్ లవ్ స్టోరీ. ఎందుకంటే అఖిల్, అభిజిత్ ఇద్దరూ ఆమె వద్దకే చేరుతారు. మోనాల్ విషయంలో అఖిల్, అభిజిత్ మధ్య మనస్పర్థలు ఉన్నాయి. వ్యక్తిగతంగా వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని సుజాత చెప్పింది. 

మోనాల్ చాలా క్లారిటీగా గేమ్ ఆడుతుంది. కానీ అఖిల్, అభిజిత్ మాత్రం క్లారిటీ లేదు. వాళ్లిద్దరి ఫీలింగ్స్ తో మోనాల్ ఆడుకుంటుంది. అదే సమయంలో ఆమె ఫీలింగ్స్ తో కూడా అఖిల్, అభిజిత్ ఆడుకుంటున్నారని అనిపిస్తుంది. కొంత సమయం అఖిల్ తో మరి కొంత సమయం అభిజిత్ తో మోనాల్ గడుపుతుంది అన్నారు. 

ఉదయాన్నే మోనాల్ అఖిల్ ని పలకరిస్తుంది. అతనితో క్లోజ్ గా ఉంటుంది. అఖిల్ త్వరగా నిద్రపోతాడు, అప్పుడు సోఫాలో అభిజిత్ ప్రక్కన కూర్చొని ముచ్చట్లు పెడుతుంది. పగలు ఎక్కువగా అఖిల్ తో గడిపే మోనాల్, రాత్రి మాత్రం అభిజిత్ తో గడుపుతుంది. వీరి ముగ్గురు రిలేషన్ ఏమిటో ఇంటిలో సభ్యులకు చాలా తికమక పెడుతుంది అని సుజాత చెప్పుకొచ్చింది.