ప్రముఖ యాంకర్ ఝాన్సీ.. నటుడు జోగినాయుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అయితే వారిద్దరూ ఎందుకు విదిపోయారనే విషయంలో చాలా మందికి స్పష్టం లేదు.

కెరీర్ పరంగా ఝాన్సీ దూసుకుపోతుంటే.. జోగినాయుడు మాత్రం డౌన్ ఫాల్ చూశాడని ఈ క్రమంలో ఆమెని వేధించడం మొదలుపెట్టాడని ప్రచారం జరిగింది. ఝాన్సీకి మరెవరితోనో తప్పుడు సంబంధం అంటగట్టాడని.. ఇలా ఎన్నో వార్తలు ప్రచారంలో ఉండేవి. 

తాజాగా ఈ విషయాలపై జోగినాయుడు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తాను ఝాన్సీని వేధించానని వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. ఝాన్సీని పెళ్లి చేసుకున్న తరువాత ఎనిమిదేళ్ల పాటు సాఫీగా జీవితం సాగించామని వెల్లడించాడు.

డబ్బు పరంగా, కెరీర్ పరంగా ఇతరులతో పోల్చుకోవడం వలనే జీవితాలు నాశనమవుతాయని.. అలాంటి విషయాల కారణంగానే తమమధ్య కూడా గొడవలు మొదలయ్యాయని  గుర్తుచేసుకున్నాడు. ఝాన్సీ తన నుండి విడిపోవడానికి ఆర్ధిక పరమైన విషయాలే కారణమని.. ఆమె తిరిగి వస్తుందని ఎన్నో ఏళ్లు ఎదురుచూసి ఆ తరువాతే మరో వివాహం చేసుకున్నట్లు జోగినాయుడు తెలిపాడు.