దివంగత తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ 'ధడక్' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తోంది. అలానే 'తక్త్' అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.

మొదటి సినిమాతోనే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మరి ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీకి కూడా నచ్చేవారు ఉంటారు కదా.. వారెవరో తాజాగా ఓ టీవీ షోలో వెల్లడించింది.

నేహా ధూపియా హోస్ట్ చేస్తోన్న 'బీఎఫ్ విత్ వోగ్' షోలో జాన్వీ పాల్గొంది. షోలో భాగంగా ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే విక్కీ కౌశల్ , కార్తిక ఆర్యన్ లలో ఎవరిని ఎంపిక చేసుకుంటావని..? జాన్వీని ప్రశ్నించగా.. ''విక్కీ కౌశల్'' పేరు చెప్పింది.

'ఉరి' చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న విక్కీ కౌశల్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ హీరోతో తొలిముద్దు కోసం వెయిట్ చేస్తోంది జాన్వీ. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. జాన్వీ నటిస్తోన్న 'తక్త్' సినిమా ఆమెకి జోడీగా నటించేది విక్కీ కౌషలే.. సో కో స్టార్ కాబట్టే అతడి పేరు చెప్పి ఉంటుందని అంటున్నారు.