దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 'ధడక్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకొని అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. తాజాగా జాన్వీ తన తండ్రి బోణీకపూర్ తో కలిసి గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకకు హాజరయ్యారు.

ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలతో కొందరు భావోద్వేగానికి గురయ్యయారు. ''ఈ ఏడాది నా జీవితంలో ఆనందం, బాధాకరమైన అనుభావాలు ఎదురయ్యాయి. ఇది నాకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇప్పుడు మా కుటుంబం మొత్తం కలిసి ఉంది. ఇది సంతోషించాల్సిన విషయం.

కానీ మా అమ్మ మాకు దూరం కావడం జీవితాంతం మర్చిపోలేను. ఇప్పటికీ మేమంతా షాక్ లో ఉన్నాం.. ఈ విషయాన్ని మేం జీర్ణించుకోలేకపోతున్నాం. మేము కష్ట సమయంలో ఉన్నప్పుడు మా వెంటే ఉండి సహాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు. నటిగా కెరీర్ మొదలుపెట్టడం నాకు చాలా ముఖ్యమైంది. 

మా తల్లితండ్రులు గర్వపడేలా చేయడానికి నాకు దొరికిన మంచి ఛాన్స్ ఇది'' అని చెప్పుకొచ్చారు. అలానే నటిగా తన తల్లి స్థాయిని ఎప్పటికీ అందుకోలేనని వెల్లడించింది. ప్రస్తుతం జాన్వీ 'తఖ్త్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెతో పాటు చాలా కరీనా కపూర్, అలియా భట్, రణబీర్ కపూర్ వంటి తారలు కనిపించనున్నారు.