పెళ్లికి చాలా టైమ్ ఉంది కానీ పెళ్లి ఎలా చేసుకోవాలనే విషయంలో మాత్రం ప్లాన్ రెడీ అంటున్నారు జాన్వీ కపూర్. శ్రీదేవి, బోనీ కపూర్‌ల ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకునే పనిలో ఉన్నారు జాన్వీ.
దివంగత సినీ నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది జాన్వీకపూర్. ఆమె నటించిన తొలి చిత్రం 'ధడక్' మంచి సక్సెస్ అందుకుంది. దీంతో జాన్వీకి ఫాలోయింగ్ పెరిగింది.
ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. 'శ్రీదేవితో ఎప్పుడైనా.. మీ పెళ్లి గురించి చర్చించారా..?' అని ప్రశ్నించగా.. మాట్లాడానని చెప్పుకొచ్చింది జాన్వీ. మగవారి విషయంలో తన తీర్పుపై అమ్మకి నమ్మకం లేదని.. ఈ విషయంలో తన అభిప్రాయాలను నమ్మేది కాదని చెప్పింది.
జాన్వీ కోసం శ్రీదేవి స్వయంగా ఒకరిని సెలెక్ట్ చేయాలని అనుకుందట.. దానికి కారణం జాన్వీ ఇతరులను చాలా తేలిగ్గా ప్రేమించేస్తుందట. ఈ విషయాలను ఆమె స్వయంగా వెల్లడించింది. ఇక కాబోయే వాడు ఎలా ఉండాలనే అడిగితే.. వృత్తి పట్ల అంకితభావం ఉండాలని, చాలా నైపుణ్యం ఉండాలని.. హాస్యచతురత చాలా ముఖ్యమని.. తనను బాగా ప్రేమించేలా ఉండాలని చెప్పుకొచ్చింది.
తన పెళ్లి సంప్రదాయబద్ధంగా తిరుపతిలో జరుగుతుందని.. పెళ్లిలో కంచి జరీ చీర కట్టుకుంటానని.. పెళ్లి తరువాత తనకు ఇష్టమైన దక్షిణాది వంటకాలు ఇడ్లీ, సాంబార్, పెరుగన్నం, ఖీర్ తదితర వంటకాలతో భోజనం ఉంటుందని చెప్పుకొచ్చింది.
