బాలీవుడ్ కథానాయిక జాన్వీ కపూర్ ఇటీవల 'ధడక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు నటిగా మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఓ పక్క సినిమాలతో పాటు ఫోటో షూట్ లలో పాల్గొంటుంది.

తాజాగా ఆమె ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఫోటో షూట్ లో పాల్గొంది. ఇప్పటివరకు ఆమె పాల్గొన్న ఫోటో షూట్ లతో పోలిస్తే ఇది కాస్త భిన్నంగా ఉంది. ఈ ఫోటోషూట్ కోసం జాన్వీ తన జుట్టుని పొట్టిగా కత్తిరించుకుంది.

అయితే తాను ఇలా జుట్టు కత్తిరించుకున్న విషయం తన తండ్రి బోణీ కపూర్ కి తెలియదని చెబుతోంది జాన్వీ. ''నేను ఫోటోషూట్ కోసం జుట్టు కత్తిరించుకున్నాను. ఈ విషయం నాన్నకు తెలియదు. నన్ను ఇలా చూస్తే చంపేస్తారు'' అంటూ చెప్పుకొచ్చింది.

మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న జాన్వీ ఇప్పుడు ఐఏఎఫ్ మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తోంది. పైలట్ దుస్తుల్లో ఉన్న జాన్వీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పాటు ఆమె 'తక్త్' అనే చారిత్రాత్మక చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.