చాలా మందికి వయసు పెరిగినా ఆంటీ, అంకుల్ అని పిలిపించుకోవడం నచ్చదు. వారిలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ఒకరు. నటి జాన్వీ కపూర్ ఆమెను ఆంటీ అని పిలుస్తుంటే స్మృతికి చచ్చిపోవాలని అనిపించిందట.

అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది స్మృతి ఇరానీ. ఇటీవల ఎయిర్ పోర్ట్ లో జాన్వీ కపూర్, స్మృతి ఇరానీ అనుకోకుండా కలిశారట. అలా కాసేపు ఇద్దరూ సరదాగా ముచ్చటించుకున్నవిషయాన్ని స్మృతి చెబుతూ.. ''జాన్వీ కపూర్ నన్ను అంటీ అని సంబోధిస్తూ మాట్లాడింది.

కాసేపటి తరువాత అలా పిలిచినందుకు సారీ కూడా చెప్పింది. అప్పుడు నేను ఏం పర్వాలేదు బేటా అని చెప్పాను. ఈ కాలం పిల్లలు ఉన్నారే.. నన్ను అలా ఆంటీ అని పిలుస్తుంటే ఎవరైనా నన్ను షూట్ చేయండని అరవాలనిపించింది'' అంటూ చమత్కరించింది. 

ప్రస్తుతం జాన్వీ కపూర్.. ఐఏఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తోంది. అలానే కరణ్ జోహార్ రూపొందిస్తోన్న 'తక్త్' అనే సినిమాలో నటిస్తోంది.