కృష్ణార్జున యుద్ధం - దేవదాస్ సినిమాలతో ఫ్యాన్స్ ని నిరాశపరిచిన నాని ఇప్పుడు జెర్సీ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. స్పోర్స్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా అనిరుధ్ స్వరాలందించారు. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ నటించింది.

ఇక సినిమా ట్విట్టర్ టాక్ విషయానికి వస్తే.. సినిమాలో ప్రధానంగా నాని నటన అద్భుతం అని తెలుస్తోంది. ఏమోషనల్ సీన్స్ లో అలాగే ఒక క్రికెటర్ గా నాని హావభావాలు ఆడియెన్స్ కి ఈజీగా కనెక్ట్ చేస్తాయట. ఫస్ట్ హాఫ్ చాలా బావుందని అయితే అక్కడక్కడా కొన్ని సీన్స్ బోర్ కొట్టిస్తాయని అంటున్నారు. 

ఇక సినిమా క్లయిమాక్స్ దశలో మరో లెవెల్ కి తీసుకెళుతుందని అనిరుధ్ తన మ్యూజిక్ తో సినిమాకి ప్రాణం పోశాడని అంటున్నారు. ఏమోషనల్ సీన్స్ ప్రధాన ఆకర్షణ నిలువగా సినిమా స్క్రీన్ ప్లే అద్బుతమని తెలుస్తోంది. ఫైనల్ గా నాని నుంచి చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా వచ్చిందని ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా సినిమా చూడగలిగితే కనెక్ట్ అవుతుందని అంటున్నారు.