నేచురల్ స్టార్ నాని నటించిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. 'దేవదాసు' సినిమా కూడా అంతంతమాత్రంగానే ఆడింది. అయితే నాని మార్కెట్ పై ఈ రెండు సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేడనే చెప్పాలి.

తాజాగా నాని నటించిన 'జెర్సీ' సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.52 కోట్ల వరకు జరిగిందని సమాచారం. శాటిలైట్ రైట్స్ 12 కోట్లు, హిందీ  డ‌బ్బింగ్  రైట్స్ 6 కోట్లు, ఓవ‌ర్సీస్ రైట్స్ 4 కోట్లు, ఏపీ, తెలంగాణ థియేట్రిక‌ల్ రైట్స్ 30 కోట్ల‌కు అమ్మ‌డుపోయిన‌ట్లు యూనిట్ వ‌ర్గాల సమాచారం.

నాని సినిమాలు ఇప్పటివరకు ఇరవై నుండి పాతిక కోట్ల రేంజ్ లో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగేవి. కానీ ఇప్పుడు ఆ నంబర్ డబుల్ అయింది. ఓవర్సీస్ లో నాని సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. కానీ ఈ మధ్య అతడు నటించిన సినిమా అక్కడ పెద్దగా ఆడలేదు. 

అయినప్పటికీ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బ్లూ స్కై సినిమాస్ ఈ హక్కులను నాలుగు కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. హిట్ టాక్ వస్తే గనుక అక్కడ ఇంత మొత్తాన్ని రాబట్టడం పెద్ద విషయమేమీ కాదు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.