శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో 'జెర్సీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో గ్లామర్ పాత్రతో పాటు ఓ పిల్లాడికి తల్లిగా కూడా నటించి ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. తనకు పిల్లల్ని కనే ఆలోచన లేదని వెల్లడించింది.

తన తాతయ్య..బామ్మలు  15 మంది పిల్లల్ని కన్నారని.. తన తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలేనని.. తాను మాత్రం పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. తన ఈ నిర్ణయంతోతానెలాంటిదాన్నో డిసైడ్ చేయొద్దని, తన చదువు, తెలివితేటలను బట్టే తీర్మానించాలని శ్రద్ధా శ్రీనాథ్‌ అంటోంది.

అలానే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడింది. అత్యాచారం మాత్రమే నేరం కాదని.. కాలం మారుతున్నా.. మహిళలపై సమాజం దృష్టి మాత్రం మారడం లేదని.. ఇప్పటికీ చాలా మంది మహిళలను ఆటబొమ్మలుగానే చూస్తున్నారనేది నిజమని చెప్పింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'జోడి' అనే సినిమాలో నటిస్తోంది. అలానే కన్నడంలో 'గోద్రా', తమిళంలో 'ఇరుంబుతిరై 2', 'మార' వంటి చిత్రాల్లో నటిస్తోంది.