ప్రైవేట్ పార్ట్స్ బహిర్గతం అయ్యేలా ఆమె డ్రెస్ ఇబ్బంది పెట్టింది వీడియో వైరల్

jennifer lopez wardrobe malfunction at a show
Highlights

ప్రైవేట్ పార్ట్స్ బహిర్గతం అయ్యేలా ఆమె డ్రెస్ ఇబ్బంది పెట్టింది వీడియో వైరల్

హాలీవుడ్ నటి, పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రఖ్యాత ఎలెన్ డిజెనెరస్ టాక్ షోకు హాజరైన సందర్భంగా ఉత్సాహంగా ఓ డాన్స్ స్టెప్ వేయబోతే.... ఆమె వేసుకున్న డ్రెస్ ఇబ్బంది పెట్టింది. ఎలెన్ టాక్ షోకు 'వరల్డ్ ఆఫ్ డాన్స్' జడ్జిలు జెన్నా డేవన్, నే యో, డెరెక్ హాగ్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లూ కలర్ డ్రెస్సులో ఆకట్టుకున్నారు. కార్యక్రమం మధ్యలో ఆమె ఓ డాన్స్ స్టెప్ వేయడానికి ప్రయత్నించగా ప్రైవేట్ పార్ట్స్ బహిర్గతం అయ్యేలా ఆమె డ్రెస్ ఇబ్బంది పెట్టింది.   

అయితే వెంటనే తన డ్రెస్ సరిచేసుకుని తను చేయాలనుకున్న డాన్స్ చేసి మెప్పించింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం జెన్నిఫర్ లోపెజ్ వయసు 48 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఆమె చాలా అందంగా, చలాకీగా కనిపిస్తోందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.'వరల్డ్ ఆఫ్ డాన్' అనేది అమెరికన్ రియాల్టీ కాంపిటీషన్ సిరీస్. ఈ షోకు జెన్నిఫర్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు 2019లో 'బై బై బర్డీ లైవ్' అనే మరో టీవీ షో కూడా చేయబోతున్నారు. ఇటు టీవీ షోలు చేస్తూనే మరో వైపు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. జెన్నిఫర్ నటించిన 'సెకండ్ ఆక్ట్' అనే చిత్రం ఈ ఏడాది నవంబర్లో విడుదల కాబోతోంది.

 

 

@JLo looks amazing even when she’s fixing her Spanx. @neyo @derekhough @jennadewan

A post shared by Ellen (@theellenshow) on

loader