హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ ఎక్కువగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలతో వార్తల్లో నిలిస్తుంటాడు. హాలీవుడ్ హీరోయిన్లతో బ్రాడ్ పిట్ ప్రేమాయణాలు ఎక్కువే. అతడి మాజీ భార్య జెన్నిఫర్ అనిస్టన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బ్రాడ్ పిట్, అనిస్టన్ 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల కాపురం తర్వాత ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత బ్రాడ్ పిట్, హాట్ బ్యూటీ ఏంజెలినా జోలీ మధ్య ప్రేమాయణం సాగింది. 

ఈ జంట 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రెండేళ్ల తర్వాత ఏంజెలినా నుంచి కూడా బ్రాడ్ పిట్ విడిపోయాడు. ప్రస్తుతం బ్రాడ్ పిట్ సింగిల్ గానే ఉన్నాడు. ఇలాంటి సమయంలో అనిస్టన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. బ్రాడ్ పిట్ నన్ను వద్దనుకున్నారు. కానీ తాను మాత్రం ఆయన్ని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా అని అనిస్టన్ తెలిపింది. 

నాతో కలసి జీవించాలని ఆయన్ని బలవంతం చేయలేను. మేమిద్దరం విడిపోయిన సందర్భంలో మా మార్గాలు వేర్వేరు అని అనుకున్నాం. అందుకె విడిపోయాం అని అనిస్టన్ తెలిపింది. మా ఇద్దరి ఆలోచనలు కూడా వేరని అప్పట్లో తెలిసింది. కానీ బ్రాడ్ పిట్ జీవితంలో తాను కూడా భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నాని తెలిపింది. బ్రాడ్ పిట్ ని వివాహం చేసుకున్న తర్వాతే తనకు జీవితం అంటే ఏంటో తెలిసిందని అనిస్టన్ వేదాంతం చెప్పుకొచ్చింది.