గత కొద్ది రోజులుగా న్యాచురల్ స్టార్ నానితో టచ్ లో ఉంటున్నారట జీవిత రాజశేఖర్. నాని కొత్త సినిమా షూటింగ్ సెట్ వెళ్లి మరీ కలిసి వచ్చారట. అందుకు కారణం ఏమిటనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.  అయితే అందుతున్న సమాచారం ప్రకారం నాని హీరోగా ఆమె ఓ కథ అనుకున్నారట.. దాని స్టోరీ లైన్ ఆల్రెడీ నానికి చెప్పారట. ఆ విషయమై ఆమె నాని ని కలిసి డిస్కస్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

ఆ కథను తనే డైరక్ట్ చేసే అవకాసం ఉందని, అలాగే తమ బ్యానర్ పైనే నిర్మిస్తామని అన్నారట. నాని సైతం ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తున్నారట. అయితే మరో డైరక్టర్ సెట్ అయితే అతని చేతిలో ఈ కథ పెడతామని ఆమె చెప్పారట. అంతేకాదు ఆ సినిమాలో నాని సరసన తన కుమార్తె శివాత్మిక హీరోయన్ గా చేస్తుందని, రాజశేఖర్ ని ఓ కీలకమైన పాత్రలో అనుకుంటున్నట్లు చెప్తున్నారు.

అంటే ఓ రకంగా ఈ సినిమా నానితో కలిసిన రాజశేఖర్ ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల స్దాయిలోనే ఉందిట. త్వరలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. మరో ప్రక్క యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కూతురు శివాత్మిక ‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీ పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సైతం హీరోగా ఈ చిత్రంతో పరిచయం కాబోతుండడం తో ఈ సినిమా ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. రీసెంట్ గా విడుదలైన ట్రయిలర్ సైతం ఆకట్టుకోవడం తో వీరిద్దరికి ఈ చిత్రం మంచి బ్రేక్ ఇవ్వనుందని భావిస్తున్నారు.