Asianet News TeluguAsianet News Telugu

`మా` పనులు ఆగిపోయింది నరేష్‌ వల్లే.. జీవిత ఫైర్‌ .. ఎన్టీఆర్‌ అసహనం వ్యక్తం చేశారంటూ..

సోమవారం ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి జాయింట్‌ సెక్రెటరీ పదవికి పోటీ చేస్తున్న జీవిత రాజశేఖర్‌ మీడియాతో మాట్లాడారు. నరేష్‌ టార్గెట్‌గా ఆమె స్పీచ్‌ సాగింది. ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుపడింది జీవిత. తనని, రాజశేఖర్‌ని `మా`లోకి తీసుకొచ్చింది నరేషే అని తెలిపింది. 

jeevitha rajashekar fire on maa president naresh
Author
Hyderabad, First Published Oct 4, 2021, 5:08 PM IST

`మా` ప్రస్తుతం అధ్యక్షుడు నరేష్‌పై జీవిత రాజశేఖర్‌ ఫైర్‌ అయ్యారు. నరేష్‌ వల్లే `మా`లో చేపట్టాల్సిన పనిలు ఆగిపోయాయని తెలిపారు. ఆయనపైనే అనేక ఆరోపణలు వచ్చాయని తెలిపారు. తాము పనులు చేసేందుకు ముందుకు వస్తే నరేష్‌ అడ్డుకున్నారని తెలిపారు. `మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌`(మా) ఎన్నికలు ఆద్యంతం టాలీవుడ్‌లో హీటు పెంచుతున్నాయి. ఈ నెల 10 ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అటు మంచు విష్ణు, ఇటు ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ దూకుడు పెంచింది. 

అందులో భాగంగా సోమవారం ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి జాయింట్‌ సెక్రెటరీ పదవికి పోటీ చేస్తున్న జీవిత రాజశేఖర్‌ మీడియాతో మాట్లాడారు. నరేష్‌ టార్గెట్‌గా ఆమె స్పీచ్‌ సాగింది. ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుపడింది జీవిత. తనని, రాజశేఖర్‌ని `మా`లోకి తీసుకొచ్చింది నరేషే అని తెలిపింది. గతేడాది `మా` డైరీ ఆవిష్కరణ సమయంలో నరేష్‌తో విభేదాలు తలెత్తాయని తెలిపారు. `నరేష్‌పై నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఆ మధ్యే ఓ 16 మంది నరేష్‌పై అనేక ఆరోపణలు చేశారు. వారితోనే మీటింగ్‌ పెడదామనుకున్నామని తెలిపింది. 

releted news: Maa elections: జగన్ కేం సంబంధం లేదని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై పేర్ని నాని

`మా`కి సంబంధించిన పనులు చేయాలని ముందుకు వస్తే సంతకాలు పెట్టేందుకు ముందుకురాలేదని తెలిపారు. గత రెండేళ్లలో ఈసీ మీటింగ్‌ పెట్టేవారు కాదని, ఒకవేళ పెట్టినా ఆయన మీటింగ్‌ కి వచ్చి మాట్లాడేవారు కాదని ఆరోపించింది. ఆయన పెట్టిన మీటింగ్‌లో ఎప్పుడూ గొడవలే జరిగేవని, కొట్టుకునే పరిస్థితి తలెత్తేదని పేర్కొంది. గతంలో ఫండ్స్ కోసం ఫారెన్‌ ప్రోగ్రామ్‌ డిజైన్‌ చేశామని తెలిపింది. 

`మా` సభ్యుల కోసం ఇళ్లు నిర్మించేందుకు ప్లాన్‌ చేశామని, దరఖాస్తు చేసేందుకు సంతకాలు పెట్టరని, ఎలాంటి సపోర్ట్ చేయరని తెలిపింది. `మా`లో మేం ఏం చేశామని, ఇళ్లు నిర్మిస్తానంటే మేం ఇటుకలు ఎత్తుకుపోయామా నరేష్‌ గారూ అంటూ ప్రశ్నించింది. `మా` ఎన్నికలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలని కోరుకున్నామని, కానీ నరేష్‌ చేసిన కామెంట్లతో తాను స్పందించాల్సి వస్తుందని తెలిపింది జీవిత. మా సత్తాతోనే ఎన్నికల్లో గెలుస్తామని, `మా` ఎన్నికల్లో తమదే విజయమని పేర్కొంది జీవిత. 

`మా` ఎన్నికలపై జూ.ఎన్టీఆర్‌ని కలిసినప్పుడు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని, ఓటు వేసేందుకు రాను ఆయన చెప్పారని, `మా`లో జరుగుతున్నది చూస్తే బాధగా ఉందని ఎన్టీఆర్‌ చెప్పినట్టు జీవిత తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios