పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన దగ్గర డబ్బు లేదని, సామాన్య స్థితికి వచ్చేశానని చెబుతున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన దగ్గర డబ్బు లేదని, సామాన్య స్థితికి వచ్చేశానని చెబుతున్నాడు. అయితే మూడేళ్ల నుండి అతడికి అంత డబ్బు ఎలా వస్తుందని జీవితారాజశేఖర్ లు ప్రశ్నిస్తున్నారు.
తన జీవితం, పార్టీ పారదర్శకంగా ఉంటుందని చెప్పుకునే పవన్ కు కోట్ల రూపాయల డబ్బు కూడా ఎక్కడ నుండి వస్తుందో చెబితే బాగుంటుందని జీవితా రాజశేఖర్ సూచించారు. పవన్ సినిమాలు వదిలేసి, ఏదో చేయాలనుకుంటున్నారు కానీ ఆయన నుండి ఇంకా క్లారిటీ కనిపించడం లేదని అన్నారు.
ఆయన మేనిఫెస్టోపై ఇప్పటికీ క్లారిటీ లేదని మరీ ముఖ్యంగా ఆయనకు ఇంత డబ్బు ఎక్కడనుండి వస్తుందనే విషయం కూడా ప్రజలకు తెలియాలి కదా అని అన్నారు. పవన్ నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నాడని, కేవలం 65 స్థానాల నుండి మాత్రమే పోటీ చేస్తే సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు.
సినిమాకు ముప్పై కోట్లు తీసుకునే స్థాయిని వదిలి పవన్ ప్రజలకు సేవ చేస్తానని వచ్చారని.. అంతవరకు బాగానే ఉందని కానీ ఆయన మాటిచ్చినట్లుగా ఒంటరిగానే నిలబడాలి కానీ రేపు మరో పార్టీతో కలిస్తే ఛండాలంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
