Asianet News TeluguAsianet News Telugu

బండ్ల గణేష్‌తో విభేదాలపై స్పందించిన జీవిత రాజశేఖర్‌..

ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లో ఉన్న బండ్ల గణేష్‌ ఆ ప్యానెల్‌ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే తాను జనరల్‌ సెక్రెటరీ పదవికి పోటీ చేస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. అయితే ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లోకి జీవిత రావడం ఆయనకు నచ్చలేదని, అందుకే పోటీలో
దిగుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీనిపై జీవిత రాజశేఖర్‌ స్పందిచారు.

jeevitha rajasekhar react on bandla ganesh comments and post
Author
Hyderabad, First Published Sep 5, 2021, 3:44 PM IST

బండ్ల గణేష్‌ వరుస ట్వీట్లు `మా` ఎన్నికలను హాట్‌ టాపిక్‌గా మార్చాయి. మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో `మా` ఎన్నికల విషయంలో చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లో ఉన్న బండ్ల గణేష్‌ ఆ ప్యానెల్‌ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే తాను జనరల్‌ సెక్రెటరీ పదవికి పోటీ చేస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. అయితే ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లోకి జీవిత రావడం ఆయనకు నచ్చలేదని, అందుకే పోటీలో దిగుతున్నట్టు ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో దీనిపై జీవిత రాజశేఖర్‌ స్పందిచారు. బండ్ల గణేష్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపింది. తాజాగా జీవిత ఓ మీడియాతో ముచ్చటిస్తూ, `మా`లో సభ్యులుగా ఉన్న ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయొచ్చని తెలిపింది. ఆమె చెబుతూ, `మా` అనేది అందరిది. ఇక్కడ ఎవరి మధ్య పోటీ లేదు. ప్యానెల్‌లో ఉన్నవాళ్లే ఎన్నికల్లో పోటీ చేయాలి? ప్యానల్‌లో లేనివాళ్లు పోటీ చేయకూడదు అనేది లేదు. సభ్యులుగా ఉన్న వాళ్లు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. 

`మా` అభివృద్ధి కోసం పాటుపడాలనే ఆలోచన అందరిలో ఉంది. బండ్ల గణేశ్‌ కూడా `మా` అభివృద్ధి కోసం కృషి చేయాలనుకుంటున్నారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంతేకానీ, నాకు వ్యతిరేకంగా ఆయన పోటీ చేస్తున్నారని నేను భావించడం లేదు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమంతా ఒక్కటే. మేమంతా కలిసే పనిచేస్తాం.  ఈ ఎన్నికల్లో నేను గెలిచినా, ఓడినా `మా` అభివృద్ధి కోసం పనిచేస్తా` అని జీవితా రాజశేఖర్‌ అన్నారు.

ప్రస్తుతం వీకే నరేష్‌ అధ్యక్షులుగా ఉన్న ప్రస్తుత కమిటీలో జీవిత రాజశేఖర్‌ జనరల్‌ సెక్రెటరీగా ఉన్నారు. మళ్లీ ఆమె అదే పోస్ట్ కి పోటీ చేయడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios