ప్ర‌ముఖ టాలీవుడ్ సీనిర్ నటి, హీరో రాజశేఖర్ సతీమణి  సినీ న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్ గురువారం చిత్తూరు జిల్లా న‌గ‌రి కోర్టుకు హాజ‌ర‌య్యారు.  ఓ చెక్ బౌన్స్ కేసులో ఆమె కోర్డ్ గుమ్మం తొక్కారు. 

టాలీవుడ్ లో వివాదాలకు పెట్టింది పేరు జీవితా రాజశేఖర్ అండ్ ఫ్యామిలీ. మా ఎలక్షన్స్ అయినా..? పాలిటిక్స్ అయినా..? ఇతర వివాదాలు ఏమైనా సరే.. ఈ స్టార్లు ఇద్దరు డిఫరెంట్ గా స్పందిస్తారు. ఇప్పటికే వీరు రకరకాల వివాదాలతో వైరల్ న్యూస్ అయ్యారు. అవుతూనే ఉన్నారు. రీసెంట్ గా మరో వివాదం విషయంలో కోర్డు గుమ్మం తొక్కారు జీవితా రాజశేఖర్ . 

త‌మ‌కు 26 కోట్ల రూపాయిలు చెల్లించాల్సి ఉంది అంటూ జీవితా రాజశేఖర్ పై రీసెంట్ గా జోస్ట‌ర్ గ్రూప్ యాజ‌మాన్యం ఆరోపించిన విషయం తెలిసిందే. త‌మ వ‌ద్ద అప్పుగా డబ్బు తీసుకున్న తీసుకున్న జీవిత రుణాన్ని తిరిగి చెల్లించ‌లేద‌ని సదరు సంస్థ ఆరోపణ. అంతేకాకుండా జీవిత ఇచ్చిన చెక్‌ను బ్యాంకులో డిపాజిట్ చేయ‌గా... అది కాస్తా బౌన్స్ అయ్యిందిజ దాంతో ఈ విషయంలో... ఈ వ్యవ‌హారాలపై జోస్టర్ గ్రూప్ యాజ‌మాన్యం నగరి కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు.. నటి జీవితా రాజ‌శేఖ‌ర్‌కు నోటీసులు జారీ చేసింది.

ఇక ఈ వ్య‌వ‌హారంపై గ‌తంలోనే స్పందించిన జీవిత‌ రాజశేఖర్ జోస్ట‌ర్ గ్రూప్ త‌మ‌పై తప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఘాటుగా విమ‌ర్శించారు. అయితే ఈ విషయంలో కోర్టుల‌పై త‌మ‌కు గౌర‌వం ఉంద‌ని, తాము నిర్థోషులుగా తప్పకు నిరూపించబడతామని నమ్మకం ఉన్నట్టు ఆమె తెలిపారు. అందుకే కోర్టు ఆదేశాల మేర‌కు విచార‌ణ‌కు హాజ‌రు అవుతామ‌ని కూడా ఆమె తెలిపారు. అన్నట్టు గానే ఈ గురువారం జ‌రిగిన కోర్టు విచార‌ణ‌కు జీవిత రాజశేఖర్ స్వ‌యంగా అటెండ్ అయ్యారు. త‌న తరపు న్యాయ‌వాదుల‌ను వెంట‌బెట్టుకుని ఆమె కోర్టుకు వ‌చ్చారు.