వర్మ సవాల్ స్వీకరించిన జీవి అసలైన వంగవీటి సినిమా తీస్తానని ప్రకటన ఆస్తులు అమ్ముకునైనా భారీ బజట్ తో తెరకెక్కిస్తానంటున్న జీవీ సుధాకర్ నాయుడు

వంగవీటి వివాదం ముదురుతోంది. వర్మ కేవలం డబ్బు కోసమే వంగవీటి రంగాను విలన్ గా చూపించాడని, మ‌మ్మ‌ల్ని అడిగి ఉంటే... వంగవీటి ఫ్యామిలీ ఫాన్స్ అంతా చందాలు వేసి డబ్బు ఇచ్చేవారని రాధా వ‌ర్మ పై ఫైర్ అయ్యారు. ఆత‌ర్వాత‌ వర్మ తాను బెదిరింపులకు భయపడేవాడిని కాదని, తన సినిమాలో తప్పులు ఉన్నాయని చెప్పేవారు దమ్ముంటే వాళ్ళు అనుకునే అస‌లైన‌ వంగవీటి కథతో సినిమా తీసి చూపించాలని సవాలు విసిరాడు. ఈ సవాల్ ని స్వీక‌రించి నేను అస‌లైన వంగ‌వీటి సినిమా తీస్తాను అని ప్ర‌క‌టించారు న‌టుడు, ద‌ర్శ‌కుడు జీవి.

విల‌న్ గా ఎన్నో చిత్రాల్లో న‌టించిన జీవి నితిన్ తో హీరో, శ్రీకాంత్ తో రంగ ది దొంగ సినిమాల‌ను తెరెకెక్కించారు. జీవి అస‌లు పేరు సుధాక‌ర్ నాయుడు. ఇటీవ‌ల కాపు ఉద్య‌మంలో కూడా పాల్గొన్నాడు. వ‌చ్చే సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ 26న వంగ‌వీటి రియ‌ల్ స్టోరీని సినిమా తీసి రిలీజ్ చేస్తాను అన్నారు. అంతే కాకుండా కాపులు అంద‌రూ గ‌ర్వ‌ప‌డేలా ఈ సినిమా ఉంటుంది. త‌న సొంత డ‌బ్బుతో ఆస్ధి అమ్మైనా స‌రే భారీ బ‌డ్జెట్ సినిమాగా రూపొందిస్తాను అని ఎనౌన్స్ చేసారు. రంగాని చంపిన వాళ్ల అంద‌రి పేర్లు బ‌య‌ట‌పెడ‌తా. ద‌మ్ముంటే ఆపండి అంటూ స‌వాలు విసిరారు.మ‌రి...ఈ వివాదం ఇంకెంత వ‌ర‌కు వెళుతుందో చూడాలి.