హీరోగా ఒకప్పుడు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన జేడి చక్రవర్తి ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన తెలుగు సినిమాలలో కనిపించలేదు. ఇప్పుడు 'హిప్పీ' సినిమాలో కీలకపాత్ర పోషించారు. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న జేడి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. టాలీవుడ్ హీరోలతో తనకున్న స్నేహం గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 

ఎన్టీఆర్ ప్రతిభ ఉన్న నటుడని, అయితే ఒక్కోసారి అవతలి వారిని టెన్షన్ పెట్టే తీరు భయంకరంగా ఉంటుందని అన్నారు. జేడి ఒకసారి తారక్  కారు ఎక్కితే.. అప్పుడు తారక్ 'మేఘాలలో..' పాటను పెట్టి 110 కిలోమీటర్ల స్పీడ్ తో డ్రైవ్ చేశాడని. ఆ సమయంలో ఎంతో టెన్షన్ పడ్డట్లు గుర్తుతెచ్చుకున్నారు. 

జీవితంలో అంతకముందు ఆ తరువాత అంతలా టెన్షన్ పడలేదని, ఆ పాట ఎందుకు చేశానా అన్నంతగా తనపై తాను కోపం వచ్చిందని నవ్వుతూ చెప్పారు. ఇక ఏపీ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ ఎన్నికల్లో పవన్ గెలిచి ఉంటే బాగుండేదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.