సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. గడ్డంతో ఉన్న మహేష్ బాబు లుక్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

అలానే మరో ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద కూడా కనిపించబోతుందని సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ కి తల్లి పాత్రలో జయప్రద దర్శనమివ్వబోతుందని వినికిడి. ఆమె పాత్ర తెరపై ఎక్కువసేపు కనిపించకపోయినా.. ఆ ఇంపాక్ట్ మాత్రం ఉండేలా దర్శకనిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన జయప్రద రాజకీయాల్లో బిజీ అవ్వడంతో సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు నటిగా బిజీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ ధారావాహికలో నటించడానికి అంగీకరించారు. ఇక ఇప్పుడు మహేష్ సినిమాతో టాలీవుడ్ లో బిజీ అవ్వాలనుకుంటోంది!