'జయం' చిత్రంతో అడుగుపెట్టి.. తొలి చిత్రంతోనే మంచి సక్సెస్ ని  సొంతం చేసుకున్న నటుడు రవి. ఆ సినిమా పేరే ఆయనకు ఇంటి పేరులా మారిపోయిన రవి ఆ తర్వాత కాలంలో కొద్దిగా వెనకబడ్డాడు. అయితే కథా పరంగా ప్రయోగాలు చేస్తూ..'తనిఒరువన్‌', 'భోగన్‌', 'టిక్‌ టిక్‌ టిక్‌', 'వనమగన్‌'.. వంటి భిన్నమైన చిత్రాలను ఎంచుకుని ఇటీవల వరుస విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఐసరి గణేశన్‌ నిర్మాణంలోని కోమా ('కోమాలి' ) చిత్రంలో నటిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌  హీరోయిన్. సంయుక్త హెగ్డే మరో హీరోయిన్. 

ఈ మూవీ ఫస్ట్ లుక్ ఫోస్టర్ చిత్ర యూనిట్  విడుదల చేసింది. చేతికి సెలైన్, పేషెంట్ గెట్ అప్ లో ఉన్న జయం రవి అయోమయంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.  ఈ పోస్టర్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.  పోస్టర్ బ్యాగ్రౌండ్ లో సోషల్ మీడియాకు సంబందించిన గుర్తులు ఉండటంతో ఇది సామజిక మాధ్యమాలపై వస్తున్న సెటైరికల్ మూవీ  అని అంతా భావిస్తున్నారు.

వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కొత్త దర్శకుడు ప్రదీప్ తెరకెక్కిస్తున్నారు. హిప్ హాప్ తామిజ్ సంగీతం స్వరపరిచారు. ఇదిలా ఉంటే జయం రవి సూపర్ హిట్ చిత్రం ‘తని ఒరువన్‌’ సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు రీసెంట్ గా  దర్శకుడు మోహన్‌రాజా ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కూడా జయం రవి హీరోగా నటించనున్నారు.

నయనతార ఆయనకు జోడీగా కనిపిస్తారని మొదట్లో వార్తలొచ్చాయి. కానీ ఆమె నటించడం లేదని సమాచారం. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు ప్రాధాన్యత ఉండటంతో ఆ పాత్రలకు కాజల్‌, సాయేషాను ఎంచుకున్నారని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.