పోలీస్ గా కీర్తి, హంతకుడిగా జయం రవి... ఆసక్తి రేపుతున్న సైరెన్ టీజర్!
విలక్షణ పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది కీర్తి సురేష్. ఆమె లేటెస్ట్ మూవీ సైరెన్. జయం రవి హీరో. విడుదలకు సిద్ధం అవుతున్న సైరెన్ మూవీ టీజర్ విడుదల చేశారు.
జయం రవి సైరెన్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆయన రెండు భిన్నమైన గెటప్స్ లో అలరించనున్నాడు. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సైరెన్ విడుదలకు సిద్ధం అవుతుండగా టీజర్ విడుదలైంది. సైరెన్ టీజర్ ఆకట్టుకుంది. ఒక మంచి అంబులెన్స్ డ్రైవర్ క్రిమినల్ గా ఎలా మారాడు అనేది అసలు కథ. జయం రవిని జైలులో శిక్ష అనుభవించిన ఖైదీగా చూపించారు.
జయం రవి చేసిన హత్యలను ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ అధికారిగా కీర్తి సరేష్ పాత్ర ఉంది. ఇక అనుపమ పరమేశ్వరన్ జయం రవి భార్యగా కనిపిస్తున్నారు. టీజర్ లో కథపై హింట్ ఇచ్చారు. యాక్షన్, ఎమోషన్, క్రైమ్, థ్రిల్లింగ్ అంశాల ఆధారంగా సైరెన్ తెరకెక్కినట్లు అర్థం అవుతుంది. సైరెన్ టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. సైరెన్ డిసెంబర్ నెలలో విడుదల కానుంది.
సముద్రఖని, యోగి బాబు కీలక రోల్స్ చేస్తున్నారు. సైరెన్ చిత్రానికి ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకుడు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. విడుదల తేదీ నిర్ణయించాల్సి ఉంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో సైరెన్ విడుదల కానుంది.