Asianet News TeluguAsianet News Telugu

పురుచ్చి తలైవి జయలలిత సినీ జీవితం

  • తమిళనాడు సీఎం జయలలిత అస్తమయం
  • రాత్రి 11.30కు మృతి చెందినట్లు ప్రకటించిన అపోలో
  • అమ్మ మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన తమిళ ప్రజలు
jayalalitha telugu movies

గత కొన్ని నెలలుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన పురుచ్చి తలైవి జయలలిత ఫిబ్రవరి 24,1948లో జన్మించారు. 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా తమిళనాడు  ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత రాజకీయాలలోకి రాకమునుపు తమిళ తెలుగు,కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించారు. 1961 నుంచి1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించారు.

 

నాట్యంలో కూడా ఆమెది అందె వేసినచేయి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలింది. అభిమానులు ఆమెను పురట్చి తలైవి(విప్లవ నాయకురాలు) అని పిలుచుకుంటా ఉంటారు.

 

జయలలిత నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. కుటుంబ పరిస్థితుల కారణంగా తల్లి బలవంతముతో తన పదిహేనవ యేటనే సినిమా రంగంలో ప్రవేశించింది. జయలలిత కన్నడంలో నటించిన తొలి సినిమా చిన్నడ గొంబె చిత్రము పెద్ద హిట్టయ్యింది. జయ తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఆమెను తార స్థాయికి తీసుకెళ్లింది.

 

జయలలిత నటించిన తెలుగు చిత్రాలు...

కథానాయకుని కథ (1965), మనుషులు మమతలు (1965), ఆమె ఎవరు? (1966), ఆస్తిపరులు (1966), కన్నెపిల్ల (1966), గూఢచారి 116 (1966), నవరాత్రి (1966), గోపాలుడు భూపాలుడు (1967), చిక్కడు దొరకడు (1967), ధనమే ప్రపంచలీల (1967), నువ్వే (1967), బ్రహ్మచారి (1967), సుఖదుఃఖాలు (1967), అదృష్టవంతులు (1968), కోయంబత్తూరు ఖైదీ (1968), తిక్క శంకరయ్య (1968), దోపిడీ దొంగలు (1968), నిలువు దోపిడి (1968), పూలపిల్ల (1968), పెళ్ళంటే భయం (1968), పోస్టుమన్ రాజు (1968), బాగ్దాద్ గజదొంగ (1968), శ్రీరామకథ (1968), ఆదర్శ కుటుంబం (1969), కథానాయకుడు (1969), కదలడు వదలడు (1969), కొండవీటి సింహం (1969) , పంచ కళ్యాణి దొంగల రాణి (1969), ఆలీబాబా 40 దొంగలు (1970), కోటీశ్వరుడు (1970), గండికోట రహస్యం (1970), మేమే మొనగాళ్లం (1971), శ్రీకృష్ణ విజయం (1971), శ్రీకృష్ణసత్య (1971), భార్యాబిడ్డలు (1972), డాక్టర్ బాబు (1973), దేవుడమ్మ (1973), దేవుడు చేసిన మనుషులు (1973), లోకం చుట్టిన వీరుడు (1973), ప్రేమలు - పెళ్ళిళ్ళు (1974)

 

ఇలా తెలుగు సినీ రంగంలోనే కాక తమిళ, కన్నడ సినీరంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన పురుచ్చి తలైవి జయలలిత మృతి యావన్మంది తమిళనాడు ప్రజలనే కాక యావత్ బారతదేశ ప్రజలను అందరినీ కలిచివేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios