షారుఖ్ 'జవాన్' కి బిగ్ షాక్, బంగ్లాదేశ్ లో నిషేధం.. రణరంగం సృష్టిస్తున్న అభిమానులు, ఏం జరిగిందంటే
కింగ్ ఖాన్ షారుఖ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జవాన్'. పఠాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో జవాన్ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. గురువారం రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది.

కింగ్ ఖాన్ షారుఖ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జవాన్'. పఠాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో జవాన్ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. గురువారం రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి షో నుంచే అట్లీ, షారుఖ్, నయనతార చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి. క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇక మిగిలింది బాక్సాఫీస్ జాతరే అని ప్రేక్షకులు అంటున్నారు.
ఊహించినట్లుగానే జవాన్ మూవీ ఇండియా వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి వీకెండ్ వరకు ఈ చిత్రం రికార్డుల మోత మోగించడం ఖాయం అని అంటున్నారు. అయితే ఇదిలా ఉండగా షారుఖ్ కి బంగ్లా దేశ్ లో విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. జవాన్ చిత్రం కోసం వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇండియా మొత్తం ఈ చిత్రం రిలీజై సందడి చేస్తున్నప్పటికీ బంగ్లాదేశ్ అభిమానులకు మాత్రం నిరాశ తప్పలేదు.
బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డు జవాన్ చిత్రంపై నిషేధం విధించింది. దీనితో జవాన్ మూవీ అక్కడ రిలీజ్ కాలేదు. నిరాశలో ఉన్న ఫ్యాన్స్ రోడ్లెక్కి నిరసన వ్యక్తంచేస్తున్నారు. జవాన్ చిత్రంపై బంగ్లాదేశ్ నిషేధం విధించడానికి కారణం అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితులే. బంగ్లాదేశ్ లో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది.
దీనితో పలు చోట్ల కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో జవాన్ లాంటి చిత్రాలకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. అంతకు ముందు పఠాన్ కూడా కాస్త ఆలస్యంగా విడుదలయింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జవాన్ మూవీ బంగ్లాదేశ్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది తెలియడం లేదు.
తొలిరోజు జవాన్ మూవీ ఇండియాలో అన్ని భాషల్లో కలిపి 75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో మాస్ మసాలా మూవీగా జవాన్ తెరకెక్కింది.