ఓటీటిలో నిన్న రాత్రి రిలీజైన ఆ సినిమా అక్కడ కూడా రికార్డ్ లు బ్రద్దలు కొడుతుందని అంచనాలు వేస్తున్నారు. 

గల్లీ పోరగాళ్ల కథను తనదైన ఫన్నీ యాంగిల్ లో మలిచి 'జాతిరత్నాలు' సినిమాతో ప్రేక్షకులను కడుపుపుబ్బా నవ్వించారు డైరెక్టర్ అనుదీప్ కేవీ. విడుదలైన రోజే సక్సెస్ టాక్ తెచ్చుకున్న రన్ ముగిశాక కూడా అదే జోష్‌లో ఉండటం విశేషం.ఓటీటిలో నిన్న రాత్రి రిలీజైన ఆ సినిమా అక్కడ కూడా రికార్డ్ లు బ్రద్దలు కొడుతుందని అంచనాలు వేస్తున్నారు. 

మార్చ్ 11న విడుదలైన జాతిరత్నాలు చిత్రం నెలరోజుల తర్వాత మొత్తానికి ఫుల్ రన్ కు చేరుకుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అవైలబుల్ లోకి వచ్చింది. ఇక జాతిరత్నాలు ఫుల్ రన్ కలెక్షన్స్ చూసుకుంటే మైండ్ బ్లాక్ అవ్వడం మాత్రం ఖాయం. అన్ని ప్రాంతాల్లో కలుపుకుని 10 కోట్లకు పైగా బిజినెస్ ను చేసింది జాతిరత్నాలు. దీంతో 11 కోట్లకు టార్గెట్ చేరుకుంది. అయితే అందరి అంచనాలను దాటుకుని ఈ సినిమా 70 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. 39 కోట్ల షేర్ ను చేసింది. దీంతో జాతిరత్నాలు సినిమా 27 కోట్లకు పైగా లాభాలను వసూలు చేసినట్లు అయింది. 

రిలీజ్ కు ముందు చేసిన ప్రమోషన్స్ మొదటి రోజే మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టగా, ఆ తర్వాత వచ్చిన మౌత్ టాక్‌తో వరుసగా అదే జోష్ కంటిన్యూ అవుతోంది. ఐదో రోజు కూడా ఈ జాతిరత్నాల స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి 20 కోట్ల మేర షేర్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక వీకెండ్ ముగిశాక కూడా అదే హవా కనిపించి టీమ్ లో ఆనందం నింపింది.

స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన 'జాతిరత్నాలు' ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడం సినీ వర్గాల్లో సైతం ఆనందం నింపింది. మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే థియేటర్స్ జనంతో కళకళలాడి పూర్వ వైభవం సంతరించుకుంటాయని ఈ జాతిరత్నాలు నిరూపించారు. చిత్రాన్ని తనదైన స్టైల్‌లో మలిచిన అనుదీప్ కేవీ దర్శకత్వ ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు దక్కాయి.