తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాటలు, ముచ్చట్లు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటులతో  ‘పిట్టగోడ’ లాంటి ఫ్లాప్ సినిమా తీసిన అనుదీప్ కేవీ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ లు బ్రద్దలు కొడుతోంది. సంచలనాలు రేపుతోంది. రిలీజ్ ముందే ఓ రేంజిలో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రానికి మంచి టాక్ కూడా రావడంతో వీకెండ్లో అదరకొట్టింది. సోమవారం నుంచి కాస్త ఊపు తగ్గిందనే చెప్పాలి.

తొలి రోజే వరల్డ్ వైడ్ దాదాపు ఐదు కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించిన ఈ చిన్న సినిమా.. ఆ తర్వాత మూడు రోజుల్లోనూ ఏమాత్రం తగ్గలేదు. ప్రతి రోజు అటు ఇటుగా రూ.5 కోట్ల మేర షేర్ రాబట్టింది. వీకెండ్ అయ్యేసరికి రూ.20 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్‌తో ట్రేడ్ ని షాక్ ఇచ్చింది. అయితే తెలంగాణాలో ఈ సినిమాకు హౌస్ ఫుల్ బోర్డ్ లు కనపడుతున్నట్లుగా ఆంద్రాలో నిన్నటి నుంచి కనపడటం లేదు. బాగా డ్రాప్ కనపడుతోంది.  యాభై శాతం ఆక్యుపెన్సీ కనపుడుతోంది. అయితే ఫస్ట్ షో, సెకండ్ షోలకు బాగానే వెళ్తున్నట్లు సమాచారం. తెలంగాణాలో మాత్రం మండే టెస్ట్ పాసయ్యింది. హైదరాబాద్ లో కలెక్షన్స్ చాలా చోట్ల స్టడీగా ఉన్నాయి.

 అయితే థియోటర్స్ పెంచిన తర్వాత మాత్రం మల్టిఫ్లెక్స్ లు కాస్త సందడి తగ్గింది. ప్రసాద్ మల్టిప్లెక్స్, ఎఎమ్ బి మల్టిఫ్లెక్స్ లలో 40 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీ సోమవారం నుంచి కనపబడుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.  అయితే ఓ చిన్న సినిమా స్థాయికి ఈ స్దాయి కలెక్షన్స్ మాత్రం అసాధారణ విషయమే. మూడో రోజుకే  ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయి, లాభాల బాట పట్టింది. ఆదివారం భారీ వసూళ్లతో బయ్యర్లకు లాభాలు పంచింది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ  సినిమా ఏడున్నర కోట్ల దాకా షేర్ రాబట్టడం విశేషం.