జాక్వెలిన్‌తో రిలేషన్ కోసం సుకేష్ పొగడ్తలతో ముంచెత్తాడని ప్రచారం జరుగుతోంది. జాక్వెలిన్ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీలా ఉంటుందని, నిజం చెప్పాలంటే ఆమె కంటే నువ్వేం తక్కువా కాదని ఆకాశానికెత్తాడట సుకేష్.
`సాహో` ఫేమ్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jaquelin Fernandez).. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోంది. మనీలాండరింగ్‌కి సంబంధించిన ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ కేసులో జాక్వెలిన్ పేరు బయటకు రావడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సుమారు రూ. పదికోట్ల విలువైన బహుమతులు సుకేష్ నుంచి జాక్వెలిన్ అందుకున్నట్టు ఆరోపణలున్నాయి. దీనిపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) Jaquelin Fernandezకి సమన్లు పంపించి విచారించింది. జాక్వెలిన్‌తోపాటు ఈ కేసులో నోరా ఫతేహీ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమె సుకేష్ నుంచి భారీగానే గిఫ్ట్ లు పొందిందని టాక్.
అయితే జాక్వెలిన్‌ని ఆకర్షించేందుకు సుకేష్ భారీ ఎత్తున స్కెచ్ వేశాడట. ప్రధానంగా ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేశాడని, ప్రశంసలతోనే ఆమెని తన ముగ్గులోకి దించాడని తెలుస్తుంది. భారీ ప్రాజెక్ట్ ఆశ చూపించాడట సుకేష్. షుగర్ కోటింగ్ డైలాగులతో ఆమెని ఐస్ చేశారని తెలుస్తుంది. ఆమెని తన బుట్టలో పడేసేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. జాక్వెలిన్ కోసం వరుస సినిమాలను నిర్మిస్తానని మాటిచ్చాడట. అంతేకాదు పలు లగ్జరీ గిఫ్ట్ లు కూడా అందజేశాడని, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో తనకు మంచి సంబంధాలున్నాయని నమ్మబలికాడట.
జాక్వెలిన్‌తో రిలేషన్ కోసం సుకేష్ పొగడ్తలతో ముంచెత్తాడని ప్రచారం జరుగుతోంది. జాక్వెలిన్ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీలా ఉంటుందని, నిజం చెప్పాలంటే ఆమె కంటే నువ్వేం తక్కువా కాదని ఆకాశానికెత్తాడట సుకేష్. అంతేకాకుండా రూ. 500 కోట్లతో 3 భాగాలుగా లేడీ సూపర్ హీరో ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తానని నమ్మబలికాడట. ఇండియాలో ఇదే హీరోయిన్ ఒరియెంటెడ్ సూపర్ హీరో సినిమా అవుతుందని మాయమాటలు చెప్పాడని బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సూపర్ హీరో కథలతో హాలీవుడ్ గ్రాఫిక్స్ నిపుణులతో సినిమా నిర్మిస్తున్నానని మాట కూడా ఇచ్చాడట సుకేష్. జాక్వెలిన్‌ను ముగ్గులోకి దింపడానికి సుకేష్ సినిమా బడ్జెట్, ప్రొడక్షన్ వంటి వాటి గురించి తెలుసుకున్నాడట.
తనకు `సాహో` హీరోయిన్ శ్రద్ధా కపూర్ 2015 నుంచి తెలుసని, ఆమెకు ఎన్‌సీబీ కేసులో సహాయం చేసినట్లు సుకేష్ ఈడీ విచారణలో పేర్కొన్నట‍్లు తెలుస్తోంది. వ్యాపార వేత్త రాజ్ కుంద్రాకు అశ్లీల చిత్రాల కేసులో బయటకు రావడానికి కూడా హెల్ప్ చేసినట్లు తెలిపాడట. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఆమెకి అడపాదడపా ఒకటి రెండు సినిమాలు వస్తున్నాయి. అదే సమయంలో స్పెషల్ సాంగ్స్ కే పరిమితమవుతుంది. ప్రభాస్ నటించిన `సాహో`లో స్పెషల్ సాంగ్లో నటించిన విసయం తెలిసిందే. తనకు సరైన అవకాశాలు లేకపోవడంతో జాక్వెలిన్ కూడా సుకేష్ మాటలకు పడిపోయిందట. ఈ విషయాన్ని ఆమె తన ఫ్రెండ్స్ వద్ద కూడా ఓపెన్ అయ్యిందని టాక్. మొత్తానికి మాయమాటలకు పడిపోయిన జాక్వెలిన్ ఇలా అడ్డంగా బుక్కయిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే జాక్వెలిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.ఆమె చేతిలో ఏకంగా ఆరు సినిమాలున్నాయి. బాలీవుడ్‌లో `ఎటాక్` చేసింది. ఇది విడుదలకు రెడీ అవుతుంది. అలాగే `బచ్చన్ పాండే`లో నటించగా, ఇది కూడా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కన్నడలో `విక్రాంత్ రోణా`లో గెస్ట్ గా కనిపించబోతుంది. మరోవైపు `సర్కస్`, `రామ్‌సేతు` సినిమాలు చేస్తుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ `హరిహర వీరమల్లు`లోనూ సెకండ్ హీరోయిన్‌గా నటించాల్సి ఉంది. కానీ ఆ ఛాన్స్ మిస్ అయ్యిందని టాక్.
also read: ED summons Aishwarya Rai: బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌కు ఈడీ సమన్లు.. పనామా పేపర్ లీక్ కేసులో..
