చాలా మంది యూట్యూబర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులు వేశారు. కాగా....  జపాన్ లోని ఓ యూట్యూబర్ కూడా ఈ పాటకు డ్యాన్స్ ఇరగదీయడం గమనార్హం, 

పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ దేశ వ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా అన్ని భాషల్లోనూ అదరగొట్టి... కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా విడుదలై చాలా నెలలు అవుతున్నా,.. దీని క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదనే చెప్పాలి. ఈ సినిమాలోని పాటలకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. చాలా మంది యూట్యూబర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులు వేశారు. కాగా.... జపాన్ లోని ఓ యూట్యూబర్ కూడా ఈ పాటకు డ్యాన్స్ ఇరగదీయడం గమనార్హం,

Scroll to load tweet…

ఈ సినిమా ప్రస్తుతం జపాన్ లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. జపాన్ లో ప్రమోషన్స్ కోసం ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కుటుంబంతో సహా అక్కడకు వెళ్లి సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ అయితే ఏకంగా జపనీస్ భాషలో మాట్లాడి అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే అక్కడి యూట్యూబర్ ఒకరు నాటు నాటు పాటకు డ్యాన్స్ ఇరగదీశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియో పోస్టు చేసిన కొద్ది గంటలకే విపరీతంగా వ్యూస్ రావడం విశేషం. ఆ డ్యాన్స్ వీడియో ని మీరు ఇక్కడ చూడవచ్చు.