యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు జాతీయ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ నెలకొనివుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ తిరుగులేని స్టార్ గా మారిపోయాడు. ప్రభాస్ ని తెలుగు అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని, యంగ్ రెబల్ స్టార్ అని పిలుచుకుంటారు. ఉత్తరాది అభిమానులకు ప్రభాస్ అమరేంద్ర బాహుబలిగా గుర్తుండిపోయాడు. ఇక బాహుబలి ప్రభంజనం ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు.. విదేశాల్లో కూడా కొనసాగింది. 

బాహుబలి చిత్రాన్ని జపాన్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. జపాన్ ప్రేక్షకులు బాహుబలి చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు జపాన్ నుంచి వందలాది గ్రీటింగ్స్ ప్రభాస్ కు వచ్చాడు. రానా కూడా ఫేమస్ అయిపోయాడు. ఇదిలా ఉండగా జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన కొందరు అభిమానులు ఇటీవల ప్రభాస్ ఇంటిముందు సందడి చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

జపాన్ యువతులంతా ప్రభాస్ ఇంటి గేటు బయట నిలబడి సందడి చేస్తున్న దృశ్యం అభిమానులని ఆకట్టుకుంటోంది. ప్రభాస్ క్రేజ్ మరో స్థాయికి చేరిందని అభిమానులంతా కామెంట్స్ పెడుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాహో చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.